జగన్‌పై దాడి కారణంగానే
ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుకు చేరుకున్న టీమిండియాను ఎయిర్ పోర్టు సిబ్బంది ఆపేశారు. దానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగడమే. జగన్మోహన్ రెడ్డి పలు కేసుల విషయంలో శుక్రవారం హైదరాబాద్ కోర్టులో హాజరుకావల్సి ఉంది. ఈ క్రమంలోనే పాదయాత్రలో భాగంగా విశాఖపట్నం ఎయిర్ పోర్టు దగ్గరి ప్రాంతం నుంచి హైదరాబాద్ బయల్దేరేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు.

సెల్ఫీ కోసం జగన్ దగ్గరికి వచ్చి
విశ్రాంతి తీసుకునే క్రమంలో లాంజ్‌లో కూర్చొని ఉండగా అతని అభిమానినంటూ ఓ వ్యక్తి(వెయిటర్) సెల్ఫీ కోసం జగన్ దగ్గరికి వచ్చాడు. అతనికి ఫొటో ఫోజిస్తుండగానే వెయిటర్ తనతో పాటు తెచ్చుకున్న చిన్నపాటి కత్తితో జగన్‌పై దాడి చేశాడు. జగన్‌తో పాటు చుట్లూ ఉన్న సిబ్బంది వెంటనే అప్రమత్తమవడంతో.. అది కాస్త జగన్ ఎడమ చేతి వెనుక భాగంలో తగిలింది.

కోడిపందేలకు ఉపయోగించే కత్తితో
వెయిటర్ వాడిన ఆయుధం కోడిపందేలకు ఉపయోగించే కత్తి కావడంతో దానికి విషం వంటివి ఏమైనా ఉన్నాయేమో అనే కోణంలో వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే జగన్ గాయం తగిలినా చికిత్స కోసం ఆగిపోకుండా విశాఖపట్నం నుంచి శంషాబాద్‌కు ప్రయాణమై వచ్చేయడంతో విశాఖపట్నంలో ట్రాఫిక్ వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడినట్లనిపిస్తుంది. అప్పటికే టీమిండియా బస్సు అక్కడకు చేరుకోవడంతో.. భద్రతా కారణాల రీత్యా దానిని ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో ఉండగానే ఆపేశారు.

వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో
మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (157 నాటౌట్: 129 బంతుల్లో 13ఫోర్లు, 4సిక్సులు) అజేయ సెంచరీ బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో షై హోప్ సెంచరీ సాధించడంతో.. వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో నిలిచింది.


Click it and Unblock the Notifications
