Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup: నాకౌట్ మ్యాచుల్లో చేతులెత్తేస్తున్న టీమిండియా.. ఇదే తొలిసారేం కాదు..!

 Team India struggles in knockout matches continue as they crash out of T20 World Cup

కోట్లాది మంది భారత ప్రేక్షకులకు విషాదం కలిగిస్తూ.. టీ20 ప్రపంచకప్ నుంచి భారత జట్టు నిష్క్రమించింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో ఘోరంగా ఓడింది. ఇలా భారత్ ఓడటం ఇదే తొలిసారి కాదు. 2013 తర్వాత ఐసీసీ టోర్నీల్లో భారత ప్రయాణాన్ని ఒకసారి గమనిస్తే..

ధోనీ శకం గోల్డెన్ టైం..

ధోనీ శకం గోల్డెన్ టైం..

2007లో తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అదరగొట్టింది. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా తన నాయకత్వ ప్రతిభను ప్రపంచ వేదికపై చాటుకున్నాడు. ఈ టోర్నీలో ట్రోఫీ అందుకున్న భారత్.. ధోనీ నాయకత్వంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఆ తర్వాత 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను కూడా ముద్దాడింది. ఈ క్రమంలోనే టెస్టు, వన్డు, టీ20 మూడు ఫార్మాట్లలోనూ ప్రపంచ నెంబర్ వన్‌ జట్టుగా నిలిచింది. చివరగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీని ధోనీ నాయకత్వంలో అందుకుంది. ఆ సమయంలో జట్టు ఉన్న ఫామ్ చూస్తే కచ్చితంగా భారత క్రికెట్‌లో అదే గోల్డెన్ టైం అని చెప్పక తప్పదు.

2013 తర్వాత అదే కథ..

2013 తర్వాత అదే కథ..

భారత జట్టుకు తన తెలివైన వ్యూహాలతో మరపురాని విజయాలు అందించిన ఎంఎస్ ధోనీ శకం 2013తో అంతమైందనే చెప్పాలి. ఆ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత్.. ఆ తర్వాత మరే ఐసీసీ టోర్నీని అందుకోలేకపోయింది. అద్భుతంగా రాణించి నాకౌట్స్ చేరినా అక్కడ బొక్కబోర్లా పడిపోవడం ఆనవాయితీగా మారింది.

పొట్టి ప్రపంచకప్స్‌లో..

పొట్టి ప్రపంచకప్స్‌లో..

2007 తర్వాత దాదాపుగా అన్ని పొట్టి ప్రపంచకప్‌లలో భారత్ ఆడింది. అయితే ఏ టోర్నీలోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. 2014లో ఈ పరిస్థితి మారింది. టోర్నీ ఆరంభం నుంచి కప్పు కొట్టాలనే కసితో ఆడిన టీమిండియా.. చిట్టచివర్లో ఫైనల్ మ్యాచులో బొక్కబోర్లా పడింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడింది. ఆ తర్వాత 2016 ప్రపంచకప్‌లో కూడా ఇలాంటి సీనే కనిపించింది. ఆ ఏడాది ఫైనల్ చేరిన భారత్.. విరాట్ కోహ్లీ విధ్వంసంతో 192 పరుగుల భారీ స్కోరు చేసింది. కానీ వెస్టిండీస్ ముందు ఈ లక్ష్యం చిన్నబోయింది. గతేడాది జట్టుకు ఎదురైన పరాభవం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. టోర్నీ ఆరంభంలోనే పాకిస్తాన్, న్యూజిల్యాండ్ జట్ల చేతిలో ఘోరంగా ఓడిన భారత్.. గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.

వన్డే వరల్డ్ కప్స్‌లోనూ ఇదే కథ..

వన్డే వరల్డ్ కప్స్‌లోనూ ఇదే కథ..

2013 తర్వాత భారత జట్టు కేవలం టీ20 ప్రపంచకప్పుల్లోనే కాదు.. వన్డే వరల్డ్ కప్స్‌లో కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆస్ట్రేలియా వేదికగా 2015లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరిన భారత్.. ఆసీస్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఒత్తిడికి తలొగ్గింది. ఆ తర్వాత 2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో కూడా సెమీస్ చేరిన టీమిండియా.. టాపార్డర్ వైఫల్యంతో ఈసారి న్యూజిల్యాండ్ ముందు తలవంచి వెనుతిరిగింది. 2021లో జరిగిన టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కూడా న్యూజిల్యాండ్ చేతిలోనే ఓటమి చవిచూసింది.

Story first published: Friday, November 11, 2022, 9:38 [IST]
Other articles published on Nov 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+