హైదరాబాద్‌లో తొలి వన్డే: ఉప్పల్‌లో టీమిండియా నెట్ ప్రాక్టీస్


హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం ఉప్పల్ వేదికగా తొలి వన్డే ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు టీ20ల సిరిస్‌ను చేజార్చుకున్న కోహ్లీసేన వన్డే సిరిస్ గెలుపే లక్ష్యంగా సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా ఆడనున్న ఆఖరి వన్డే సిరిస్‌లో పూర్తిస్థాయిలో బరిలో దిగబోతోంది.
ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్
ఇందులో భాగంగా శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్లు నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాయి. ఆస్ట్రేలియాతో వన్జే సిరిస్ కోసం భారత క్రికెట్ జట్టు ఉప్పల్ మైదానంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసింది. తొలి వన్డేలో విజయం సాధించి వన్డే సిరిస్‌ను గెలుపుతో ప్రారంభించాలనే తలంపుతో కోహ్లీసేన ఉంది. దీంతో తొలి వన్డే కోసం ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

జట్టు కూర్పును సరిచూసుకోవడానికి
వరల్డ్‌కప్ ఆడబోయే జట్టు కూర్పును సరిచూసుకోవడానికి జట్టు మేనేజ్‌మెంట్‌కు ఇదే ఆఖరి అవకాశం. ఈ సిరిస్ కేఎల్ రాహుల్, జడేజా, విజయ్ శంకర్‌లకు అగ్ని పరీక్షే. ఎందుకంటే.. ఈ సిరిస్‌లో సత్తా చాటితేనే వాళ్లు ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. కాగా, భారత గడ్డపై ఆస్ట్రేలియా జట్టు తన పర్యటనల్లో ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు గెలిస్తే, భారత్ 25 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించగలిగింది.

ఫేవరేట్‌గా టీమిండియా
ఐదింట్లో ఫలితం తేలలేదు. గతంలో ఆస్ట్రేలియా జట్టు పటిష్టంగా ఉండటంతో భారత్‌పై అలవోక విజయాలను అందుకుంది. అయితే, గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేయడం.. అదే సమయంలో ఆస్ట్రేలియా బలహీనపడింది. ఈ ఏడాది మొదట్లో సొంతగడ్డ కోహ్లీసేనతో జరిగిన వన్డే సిరిస్‌ను చేజార్చుకుంది. దీంతో అన్ని విభాగాల్లో ఆస్ట్రేలియాతో పోలిస్తే టీమిండియా మెరుగైన జట్టుగా ఉంది. దీంతో ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications