
దక్షిణాఫ్రికాలో ఈ సారి ఎలాగైనా టెస్ట్ సిరీస్ గెలవాలనే లక్ష్యంతో అక్కడికి వెళ్లింది భారత జట్టు. ఈ నెల 16న ఉదయాన్నే స్పెషల్ విమానంలో దక్షిణాఫ్రికాకు బయలుదేరిన టీమిండియా ఆ రోజు సాయంత్రానికి అక్కడికి చేరుకుంది. గురువారం సాయంత్రమే జోహన్నెస్ బర్గ్‌లో ల్యాండ్ అయింది. అనంతరం టీమిండియా అంతా హోటళ్లో ఒక రోజు క్వారంటైన్‌లో ఉంది. అనంతరం అందరికీ కరోనా పరీక్షలు చేశారు. అందులో అందరికీ నెగెటివ్‌గా తేలింది. దీంతో నేడు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అధ్వర్యంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. దీనికి సంబంధిన వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
జాలీగా ఫూట్‌బాల్ ఆడుతున్న టీమిండియా
బీసీసీఐ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో టీమిండియా ఆటగాళ్లంతా జాలీగా ఫూట్‌వాలీ ఆడుతున్నారు. రోటీన్‌కు భిన్నంగా వారి ప్రాక్టీస్ సాగుతుంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా వాళ్లతో జాలీగా ఫూట్‌వాలీ ఆడాడు. టీమిండియా ఆటగాళ్లు అంతా రెండు జట్లుగా విడిపోయి ఈ ఫూట్‌బాల్ ఆడారు. ఈ జట్లలో ఒకదానికి అశ్విన్, మరో దానికి కోచ్ ద్రావిడ్ నాయకత్వం వహించారు. బంతిని కాలితో తంతూ తమ స్కిల్స్ చూపించారు. అంతేకాకుండా తమ ఫిట్‌నెస్‌ను ఇంప్రూవ్ చేసుకున్నారు. అలాగే ఈ మ్యాచ్ మధ్యలో అశ్విన్, పుజారా ఏదో సీరియస్‌గా గొడవపడ్డట్టు వీడియోలో గమనించవచ్చు. అలాగే ఈ వీడియోలో ద్రావిడ్ ఫుట్‌బాల్ స్కిల్స్‌ను చూసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన బీసీసీఐ జోహన్నెస్ బర్గ్‌లో టీమిండియా ఆటగాళ్లు వారి తొలి ప్రాక్టీస్ సెషన్‌కు ముందు వారి బ్యాటరీలను రిచార్జ్ చేసుకుంటున్నారని క్యాప్షన్ పెట్టింది. కాగా సౌతాఫ్రికాలో టీమిండియా తొలి ప్రాక్టీస్ సెషన్ ఆదివారం ఉదయం ప్రారంభంకానుంది.
26 నుంచి ఫస్ట్ టెస్ట్
కాగా భారత్, సౌతాఫ్రికా మధ్య బాక్సింగ్ డే సందర్భంగా ఈ నెల 26 నుంచి సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. జనవరి 3 నుంచి జోహన్నెస్ బర్గ్ వేదికగా రెండో టెస్ట్, జనవరి 11 నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. అనంతరం ఇరు జట్లు 3 వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి.
భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), లోకేష్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్