Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు షాక్: ఆసియా కప్ మధ్యలో జట్టును వీడిన స్టార్ క్రికెటర్!

Asia Cup 2025: ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 2025లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లోనే యూఏఈపై 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి టోర్నమెంట్‌లో అడుగుపెట్టింది. రాబోయే రోజుల్లో పాకిస్థాన్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. జట్టులో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న ఆయన.. టోర్నమెంట్ మధ్యలోనే టీమిండియాను వీడి ఇంగ్లాండ్‌కు బయలుదేరారు.

వాషింగ్టన్ సుందర్ నిర్ణయం వెనుక కారణాలు
వాషింగ్టన్ సుందర్‌ను ఆసియా కప్ 2025 కోసం ప్రధాన జట్టులో కాకుండా రిజర్వ్ స్క్వాడ్‌లో చేర్చారు. దీంతో వాషింగ్టన్ సుందర్ కు ఈ టోర్నమెంట్లో ఆడే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు హ్యాంప్‌షైర్ క్రికెట్ క్లబ్ నుంచి ఆయనకు ఓ కీలక ఆఫర్ వచ్చింది. తన ఆటను కొనసాగించాలనే ఉద్దేశంతో వాషింగ్టన్ సుందర్ ఈ ఆఫర్‌ను అంగీకరించారు. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో హ్యాంప్‌షైర్ తరఫున మిగిలిన రెండు మ్యాచ్‌లలో బరిలోకి దిగనున్నారు.

Team India Star Washington Sundar Leaves Asia Cup Mid-Tournament Here s Why

హ్యాంప్‌షైర్ క్రికెట్ క్లబ్ హర్షం వ్యక్తం
వాషింగ్టన్ సుందర్‌ను తమ జట్టులోకి స్వాగతిస్తూ హ్యాంప్‌షైర్ క్రికెట్ క్లబ్ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. "సుందర్‌ను మా జట్టులోకి చేర్చుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. స్వాగతం వాషి! భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, రోజ్ అండ్ క్రౌన్‌పై మా చివరి రెండు మ్యాచ్‌లకు హ్యాంప్‌షైర్ తరపున ఆడతారు" అని పేర్కొంది.క్లబ్ క్రికెట్ డైరెక్టర్ గైల్స్ వైట్ కూడా సుందర్ రాకపై తన ఆనందాన్ని పంచుకున్నారు. "వాషింగ్టన్‌ను మా జట్టులోకి చేర్చుకోవడం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇంగ్లాండ్‌పై అతని గత సిరీస్ అద్భుతంగా ఉంది. సోమర్‌సెట్, సర్రే జట్లపై రాబోయే రెండు కీలక మ్యాచ్‌లలో అతను ప్రధాన పాత్ర పోషిస్తాడని మేము నమ్ముతున్నాం" అని ఆయన అన్నారు.

ఇంగ్లాండ్ పర్యటనలో వాషింగ్టన్ సుందర్ అద్భుత ప్రదర్శన
వాషింగ్టన్ సుందర్ ఇటీవలి ఇంగ్లాండ్ పర్యటనలో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తన సత్తా చాటారు. 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో బ్యాటింగ్‌లో 47 సగటుతో 284 పరుగులు చేశారు. ఇందులో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో సాధించిన అద్భుతమైన సెంచరీ కూడా ఉంది. సుందర్ తన బౌలింగ్‌లో 38.57 సగటుతో 7 వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్ చూపించిన ఈ అద్బుతమైన ఫామ్‌ను చూసే హ్యాంప్‌షైర్ క్లబ్ కౌంటీ సీజన్ చివరి భాగం కోసం అతన్ని ఎంచుకుంది.

టీమిండియాపై ప్రభావం?
వాషింగ్టన్ సుందర్ రిజర్వ్ స్క్వాడ్‌లో ఉండటం వల్ల ఆయన నిష్క్రమణ భారత జట్టు ఆసియా కప్ ప్రదర్శనపై ఎటువంటి ప్రభావం చూపదు. ప్రధాన జట్టులో సుందర్‌కు ఆడే అవకాశం లభించదు కాబట్టి, ఈ నిర్ణయం భారత జట్టుకు పెద్ద సమస్యగా మారదు. ఈ కౌంటీ మ్యాచ్‌ల ద్వారా సుందర్ తన ఫామ్‌ను కొనసాగించే అవకాశం లభిస్తుంది.

Story first published: Friday, September 12, 2025, 11:58 [IST]
Other articles published on Sep 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+