Jasprit Bumrah : బుమ్రా వెన్నుకు ఆపరేషన్.. మరో ఆరు నెలల ఆటకు దూరం?

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో ఆరు నెలలపాటు క్రికెట్‌కు దూరమయ్యేలా ఉన్నాడు. కొంతకాలంగా వెన్ను నొప్పితో తీవ్రంగా బాధ పడుతున్న అతన్ని భారత జట్టులో నుంచి తొలగించాల్సి వచ్చింది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ నాటికి అతను తిరిగి టీమిండియాకు అందుబాటులోకి వస్తాడని అంతా అనుకున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీసులో అతన్ని ఆడించారు.
ఆసీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన అతను.. ఆ తర్వాత తన గాయం తిరగబెట్టడంతో మరోసారి ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఆసియా కప్‌తోపాటు టీ20 వరల్డ్ కప్ కడా బుమ్రా ఆడలేదు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటూ ఉన్న అతన్ని తాజాగా న్యూజిల్యాండ్‌కు తరలించినట్లు సమాచారం. ఈ వివరాల ప్రకారం చూసుకుంటే.. ప్రస్తుతం బుమ్రా న్యూజిలాండ్‌లో ఉన్నాడు.
బుమ్రా గాయం నుంచి కోలుకోవడానికి చాలా కాలం పాడుతుందని వైద్యులు చెప్తున్నారు. ఆపరేషన్ తర్వాత బుమ్రా అదే ఆస్పత్రిలో కొంత కాలం గడపాల్సి వస్తుంది. ఈ క్రమంలో శస్త్రచికిత్స తర్వాత నేరుగా అతను జట్టులోకి రావడం కూడా అసాధ్యంలా కనిపిస్తోంది దానికితోడు అతను పూర్తిగా కోలుకొని మళ్లీ బౌలింగ్ చేయాలంటే బుమ్రాకు కనీసం ఆరు నెలల విశ్రాంతి అసవరం అని తెలుస్తోంది. ఈ విశ్రాంతి తర్వాత మళ్లీ నెమ్మదిగా తన పూర్వపు ఫామ్ కోసం ప్రయత్నించడం బుమ్రా ముందున్న సవాల్.
ఇదే జరిగి బుమ్రా మళ్లీ క్రీడా మైదానంలో దిగాలని అంతా ఆశిస్తున్నారు. ఈ లెక్కన మరికొన్ని రోజుల్లో జరిగే ఐపీఎల్ 16వ సీజన్‌లో బుమ్రా ఆడటం ఇక కల్లే. దానికితోడు ఈసారి భారత్ కనుక డబ్ల్యూటీసీ ఫైనల్ చేరితే.. ఆ మ్యాచ్‌లో కూడా బుమ్రా ఆడటం కష్టమే. దానికితోడు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో కూడా బుమ్రా ఆడటం అనుమానంగా తోస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications