Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023 : ఆసియా కప్ ఆడే టీం ఇదే.. తెలుగు కుర్రాడికి ఛాన్స్, నో సంజూ!

వరల్డ్ కప్ ముందు జరగనున్న ఆసియా కప్ కోసం ఫ్యాన్స్ అంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ టోర్నీ గెలిచిన జట్టు వరల్డ్ కప్‌లో కూడా టైటిల్ ఫేవరెట్‌గా నిలవడం ఖాయం. ఈ క్రమంలోనే ఈ టోర్నీ కోసం అన్ని ఆసియా దేశాలు తమ బలమైన జట్లను ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

బీసీసీఐ కూడా అదే పనిలో ఉంది. అయితే కీలక ప్లేయర్లకు గాయాల కారణంగా టీమిండియా సెలెక్షన్ పెద్ద తలనొప్పిగా మారింది. అయితే సెలెక్షన్ కమిటీ మాత్రం ఇప్పటికే ఎంపిక చేయాల్సిన ప్లేయర్ల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు సమాచారం. ఈ టీంలో కొందరు కీలక ప్లేయర్లను బీసీసీఐ పక్కన పెట్టేసిందట.

team-india-squad-for-asia-cup-2023-is-finalised

ఆదివారం నాడు బీసీసీఐ నుంచి ఆసియా కప్ జట్టు ప్రకటన ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ సెలెక్ట్ చేసిన టీం వివరాలు లీక్ అయినట్లు సమాచారం. అదే కనుక నిజమైతే ఆసియా కప్ కోసం భారత్ నుంచి 17 మంది సభ్యుల బృందాన్ని బీసీసీఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

వీరిలో కేరళ యంగ్‌స్టర్ సంజూ శాంసన్‌కు మరోసారి మొండిచెయ్యి చూపినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే తెలుగు తేజం తిలక్ వర్మకు ఈ టోర్నీలో అవకాశం ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ అయిందట. ఈ నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించినా కూడా.. పలువురు మాజీల సలహాలతో సెలెక్టర్లు కూడా ఏకీభవించంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట.

team-india-squad-for-asia-cup-2023-is-finalised

టీమిండియా టాపార్డర్‌లో లెఫ్ట్ హ్యాండర్ అవసరం అని భావించిన సెలెక్టర్లు తిలక్ వర్మకు అవకాశం ఇచ్చారట. అదే సమయంలో వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కానీ అతను ఈ టోర్నీ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడా? అనేది అనుమానంగా ఉంది. అతనితోపాటు అయ్యర్ పరిస్థితి కూడా అదే మాదిరి ఉంది.

భారత బృందం : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్/రవిచంద్రన్ అశ్విన్.

నోట్: రాహుల్, అయ్యర్ ఫిట్‌నెస్‌ను బట్టి ఎంపిక ఉంటుందిట.

Story first published: Sunday, August 20, 2023, 10:02 [IST]
Other articles published on Aug 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+