
మాంచెస్టర్: భారత క్రికెట్ జట్టు బౌలింగ్ తురుపుముక్క కుల్‌దీప్ యాదవ్ ఆస్ట్రేలియా లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్‌ను కలుసుకున్నాడు. చాలాసేపు అతనితో ముచ్చట్లు పెట్టుకున్నారు. న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్ ఆడటానికి మాంచెస్టర్ హోటల్ జట్టుతో పాటు గ్రౌండ్‌కు బయలుదేరిన కుల్‌దీప్ యాదవ్.. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లకముందే- షేన్ వార్న్‌ను కలిశాడు. ఈ సందర్భంగా షేన్ వార్న్ అతనికి బౌలింగ్ చిట్కాలు చెప్పడం కనిపించింది.
ఈ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో కుల్‌దీప్ యాదవ్ ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదనే విషయం మనకు తెలిసిందే. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. పరుగులను సైతం ధారాళంగా సమర్పించుకుంటున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 10 ఓవర్లలో 60కి పైగా పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్‌ను మాత్రమే పడగొట్టగలిగాడు. శ్రీలంకతో సైతం అతను నాసిరకంగానే బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చి, ఒక వికెటే తీసుకున్నాడు.
న్యూజిలాండ్‌తో జరగబోయే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తుది జట్టులో చోటు లభిస్తుందా? లేదా? అనే స్థాయికి చేరుకున్నాడతను. ఈ నేపథ్యంలో- షేన్ వార్న్‌ను కలుసుకుని, కిటుకులు నేర్చుకునే ప్రయత్నం చేశాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షేన్ వార్న్ గ్రౌండ్‌లో కనిపించగానే ఆయన వద్దకు వెళ్లాడు కుల్‌దీప్. చేతులు కలిపాడు. ముచ్చట్టు పెట్టుకున్నాడు.
నిర్ణీత సమయం కంటే ముందుగానే..
భారత క్రికెట్ జట్టుకు సెమీఫైనల్ ఫీవర్ పట్టుకున్నట్టుంది. నిర్దేశిత సమయం కంటే చాలాముందుగానే జట్టు క్రికెటర్లు హోటల్‌ను వీడారు. అరగంట ముందే మాంచెస్టర్‌లోని హోటల్‌ను వీడారు. ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫుటేజీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.