న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

120 బాల్స్‌..160 ర‌న్స్‌..సింగిల్ వికెట్‌!

ICC Cricket World Cup 2019 : Team India Spin Bowling Utter Flop Against England In The World Cup
Team India Spin bowling utter flop against England in the World Cup

బ‌ర్మింగ్‌హామ్‌: ప్ర‌పంచ క్రికెట్‌లో అత్యంత ప‌టిష్ట‌మైన బౌలింగ్ వ‌న‌రులు ఉన్న టీమ్ ఏది అని ప్ర‌శ్నిస్తే..టీమిండియా అని ఠ‌క్కున చెప్పేస్తారు ఎవ‌రైనా గానీ! అదేదో గాలివాటంగా వ‌చ్చిన పేరు కాదు. ఓ ఎండ్‌లో పేస్ త్ర‌యం, మ‌రో ఎండ్ నుంచి స్పిన్ ద్వ‌యం బౌలింగ్ చేస్తోంటే..ఎదురుగా ఉన్న బ్యాట్స్‌మెన్ కాస్త ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ఆడ‌తాడు. ఒక‌టికి రెండుసార్లు ఆలోచించి భారీ షాట్లు ఆడ‌తారు. బ‌ర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్ మాత్రం దీనికి భిన్నంగా క‌నిపించింది. బంతి ఎలాంటిద‌నేది చూడ‌లేదు ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లు. బౌల‌ర్ ఎవ‌ర‌నేదీ ప‌ట్టించుకోలేదు. బంతిని స్టాండ్స్‌లోకి పంపించ‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకున్నారు.. ప్ర‌త్యేకించి జానీ బెయిర్‌స్టో!

స్పిన్ బౌలింగ్ క‌కావిక‌లం

స్పిన్ బౌలింగ్ క‌కావిక‌లం

గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీమ్ ఎంత ప‌ట్టుద‌ల‌గా ఆడిందో మనం క‌ళ్లారా చూశాం. క‌ళ్ల‌ప్ప‌గించి మ‌రీ చూశాం. య‌జువేంద్ర చాహ‌ల్‌, కుల్‌దీప్ యాద‌వ్‌ల బౌలింగ్‌ను ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లు ఎలా తుక్కు రేగ్గొట్టారో చూసి ఆశ్చ‌ర్య‌పోయాం. తొలి ఓవ‌ర్ నుంచే ఫాస్ట్ బౌలింగ్‌పై ఇంగ్లండ్ ఓపెన‌ర్లు జేస‌న్ రాయ్‌, జానీ బెయిర్‌స్టో చెల‌రేగిపోయి ఆడారు. క‌ట్ట‌డి చేయ‌డానికి వారు చేసిన ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌లేదు. ఓవ‌ర్‌కు ఆరు ప‌రుగులు చొప్పున పిండుకున్నారు. అందుకే- సంప్ర‌దాయానికి విరుద్ధంగా అయిదో ఓవ‌ర్‌లోనే ఆఫ్ స్పిన్న‌ర్ య‌జువేంద్ర చాహ‌ల్ చేతికి బంతిని అప్ప‌గించాడు స్కిప్ప‌ర్ విరాట్ కోహ్లీ.

చాహ‌ల్ అయినా.. కుల్‌దీప్ యాద‌వ్ అయినా

చాహ‌ల్ అయినా.. కుల్‌దీప్ యాద‌వ్ అయినా

తొలి సెష‌న్‌లోనే చాహ‌ల్‌ను బౌలింగ్‌కు దించిన‌ప్ప‌టికీ.. ఎలాంటి ఫ‌లితం క‌నిపించ‌లేదనే విష‌యం ఆ ఓవ‌ర్‌తోనే తేట‌తెల్ల‌మైంది. ఏ మాత్రం ప్ర‌భావాన్ని చూప‌లేక‌పోయారు స్పిన్న‌ర్లు. వికెట్‌ను తీయాల‌నే మాట అటు ఉంచి, కనీసం ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ల‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాలు కూడా బెడిసి కొట్టాయి. స్పిన్ బౌలింగ్‌ను, బౌల‌ర్ల‌ను ఓ ఆట ఆడేసుకున్నారు ఓపెన‌ర్లు జేస‌న్ రాయ్‌, జానీ బెయిర్‌స్టో. 160 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ ల‌భించింది టీమిండియాకు. అదీ స్పిన్ బౌలింగ్‌లోనే. కుల్‌దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించిన జేస‌న్ రాయ్‌.. లాంగ్ ఆన్‌లో స‌బ్‌స్టిట్యూట్ రవీంద్ర జ‌డేజా చేతికి చిక్కాడు. ఇక వికెట్ల ప్ర‌వాహం మొద‌లైంద‌ని ఆశించిన స‌గ‌టు అభిమానికి నిరాశే ఎదురైంది.

120 బంతులేసి..160 పరుగులు స‌మ‌ర్పించేసి..

120 బంతులేసి..160 పరుగులు స‌మ‌ర్పించేసి..

ఈ మ్యాచ్‌లో స్పిన్ బౌలింగ్ విభాగంలోని లోపాలు ఏమిటో స్ప‌ష్ట‌మైంద‌నే అనుకోవాల్సి ఉంటుంది. కుల్‌దీప్ యాద‌వ్‌, య‌జువేంద్ర చాహ‌ల్ ఇద్ద‌రూ క‌లిసి 120 బంతుల‌ను వేశారు. 160 పరుగుల‌ను ధారాళంగా ఇచ్చుకున్నారు. ప‌డిన వికెట్ మాత్రం ఒకే ఒక్క‌టి. తమ ప‌ది ఓవ‌ర్ల కోటాలను ఇద్ద‌రు స్పిన్న‌ర్లు పూర్తి చేశారే గానీ వికెట్ల‌ను రాబ‌ట్టుకోలేక‌పోయారు. కుల్‌దీప్ యాద‌వ్ 10 ఓవ‌ర్లు వేసి 72 ప‌రుగులు ఇచ్చుకున్నాడు. ఒకే ఒక్క వికెట్ ప‌డ‌గొట్టాడు. ఇక య‌జువేంద్ర చాహ‌ల్ ప‌రిస్థితి మ‌రీ దారుణం. 10 ఓవ‌ర్ల‌లో 88 ప‌రుగులు ఇచ్చుకున్నాడు. ఒక్క వికెట్‌ను కూడా తీసుకోలేక‌పోయాడు. దీన్ని బ‌ట్టి చూస్తే.. స్పిన్ బౌలింగ్ ఎంత నాసిర‌కంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. వారి బౌలింగ్ నాణ్య‌త‌గా ఉంటుది అని అనుకున్న‌ప్ప‌టికీ..వికెట్ల‌ను ప‌డ‌గొట్ట‌లేక‌పోవ‌డమే దీనికి నిద‌ర్శ‌నం.

ఫాస్ట్ బౌలింగ్ కూడా అంతే!

ఫాస్ట్ బౌలింగ్ కూడా అంతే!

టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్లు కూడా విఫ‌లం అయ్యారు. ఒక్క మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ మాత్ర‌మే కాస్త రాణించ‌గ‌లిగాడు. అయిదు వికెట్ల‌ను ప‌డ‌గొట్ట‌గ‌లిగిన‌ప్ప‌టికీ.. భారీగా ప‌రుగుల‌ను స‌మ‌ర్పించుకున్నాడు. 10 ఓవ‌ర్ల‌లో 69 ప‌రుగులు ఇచ్చుకున్నాడు ష‌మీ. యార్క‌ర్ కింగ్ జ‌స్‌ప్రీత్ బుమ్రా ఒక్క‌డే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు గానీ ఆశించిన స్థాయిలో వికెట్ల‌ను తీసుకోలేక‌పోయాడు. 10 ఓవ‌ర్ల‌లో 44 ప‌రుగుల‌కు ఒక్క వికెట్టే తీసుకున్నాడు. హార్దిక్ పాండ్య‌ను కూడా ఉతికి ఆరేశారు ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లు. 10 ఓవ‌ర్ల‌లో 60 ప‌రుగులు పిండుకున్నారు.

1
43681

{headtohead_cricket_3_2}

Story first published: Monday, July 1, 2019, 8:46 [IST]
Other articles published on Jul 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X