Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL : మొదట బ్యాటింగ్ చేస్తే.. 400 పరుగులు చేయడమే టీమిండియా టార్గెట్!

Team India should try to score 400 runs in INDvsSL second ODI

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు భారీ స్కోరు చేసింది. టాపార్డర్ అద్భుతంగా ఆడటంతో 373 పరుగుల స్కోరు చేసింది. ఆ తర్వాత లంకేయులు పోరాడినా ఈ టార్గెట్ ఛేజ్ చెయ్యలేకపోయారు. అయితే భారత బ్యాటింగ్ విధానం మాత్రం అందరినీ ఆకట్టుకుంది.

ఆరంభం నుంచే టీమిండియా బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వన్డేల్లో తొలిసారి కలిసి ఓపెనింగ్ చేసి శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ చక్కగా రాణించారు.

రెండో వన్డేలో కూడా..

రెండో వన్డేలో కూడా..

గువాహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో ఉన్నట్లే.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కూడా పిచ్ ఎక్కువగా బ్యాటింగ్‌కే సహకరిస్తుంది. ఇక్కడ ఇటీవలి కాలంలో మంచి హై స్కోరింగ్ మ్యాచ్‌లు జరిగాయి. దీంతో ఈ మ్యాచ్ కూడా కచ్చితంగా భారీ స్కోర్లు నమోదవుతాయిన మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. అలాగే భారత బ్యాటింగ్ విధానాన్ని అతను మెచ్చుకున్నాడు. పిచ్, వాతావరణం కనుక బౌలర్లకు సహకారం అందించకపోతే.. బ్యాటర్లు ఎక్కడైనా చెలరేగుతారని చోప్రా చెప్పాడు. ఇక్కడ కొత్త బంతికి కొంత స్వింగ్ దొరికే అవకాశం ఉందని చెప్పిన అతను.. ఆ తర్వాత ఇక పూర్తిగా బ్యాటర్లదే ఆధిపత్యం అని స్పష్టం చేశాడు.

వన్డే ఫార్మాట్ మారిపోయింది..

వన్డే ఫార్మాట్ మారిపోయింది..

ఇటీవలి కాలంలో వన్డే ఫార్మాట్‌లో చాలా మార్పులు వచ్చాయని చోప్రా అన్నాడు. మొదటి 7-10 ఓవర్లు కనుక జాగ్రత్తగా ఆడుకుంటే ఆ తర్వాత భారీ స్కోర్లు చెయ్యవచ్చన్నాడు. భారత్ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పాడు. వన్డేల్లో భారీ స్కోర్లు చేయడం ఇటీవలి కాలంలో రూల్‌గా మారిపోయిందన్నాడు. అలాగే ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు నమోదవుతాయని, ఈ మ్యాచ్ లో-స్కోరింగ్ అవుతుందని తాను అనుకోవడం లేదని తెలిపాడు. కేవలం బంగ్లాదేశ్ వంటి పూర్తి టర్నింగ్ ట్రాక్ ఉంటేనే స్కోర్లు తక్కువగా నమోదవుతాయని, లేదంటే ఎక్కడైనా భారీ స్కోర్లే నమోదవుతాయని తేల్చిచెప్పాడు.

టార్గెట్ 400..

టార్గెట్ 400..

తొలి వన్డేలో భారత జట్టు బ్యాటింగ్‌ను చోప్రా బాగా మెచ్చుకున్నాడు. గువాహతిలోని బర్సాపరా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ షాట్లు ఆడిందన్నాడు. 'బర్సాపరాలో భారత బ్యాటర్లు బాదేశారు. ఇంతకుముందు టీమిండియా ఆటతీరు మార్చుకోవాలని అనేవాళ్లం. ఇప్పుడు ఇంక ఏం మార్చుకోవాల్సిన అవసరం ఉంది? నిజానికి తొలి వన్డేలో 400 పరుగులు చేయాల్సింది. ఈడెన్ గార్డెన్స్‌లో కూడా 400 పరుగులు చేయొచ్చు. అది సాధ్యమే కదా. అలాంటప్పుడు 400 చెయ్యడమే టార్గెట్‌గా ఎందుకు పెట్టుకోకూడదు' అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

Story first published: Thursday, January 12, 2023, 12:10 [IST]
Other articles published on Jan 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+