Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వ‌రుణుడు వ‌ర్సెస్ కోహ్లీసేన‌: సేఫ్ జోన్‌లోనే ఉన్నా..ఓవ‌ర్లు కుదిస్తే చెమ‌టోడ్చాల్సిందే!

ICC Cricket World Cup 2019 : IND vs NZ: Team India Target Likely To Be In 20 Overs During Semifinals
Team India should play atleast 20 Overs as first semifinal on day-2

మాంచెస్ట‌ర్‌: భార‌త క్రికెట్ జ‌ట్టు విచిత్ర ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. ఇన్నాళ్లూ ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌ను ధీటుగా ఎదుర్కొన్న భార‌త క్రికెట్ జ‌ట్టు- ఇక వ‌రుణ దేవుడితో పోటీ ప‌డుతోంది. ఒక్క బంతి కూడా ప‌డ‌కుండా లేదా 10, 15 ఓవ‌ర్ల త‌రువాత‌ మ్యాచ్ ర‌ద్ద‌యితే టీమిండియాకు టెన్ష‌న్ ఉండ‌దు. నేరుగా ఫైన‌ల్‌కు వెళ్లిపోతుంది. మ్యాచ్ కొన‌సాగితే మాత్రం వ‌రుణుడి గండం పొంచి ఉన్న‌ట్టే. ఓవ‌ర్లు కుదించిన త‌రువాత టీమిండియా గ్రౌండ్‌లో దిగాల్సిన ప‌రిస్థితి ఎదురైతే.. చెమ‌టోడ్చ‌క త‌ప్ప‌దు. మ్యాచ్ కొన‌సాగితే- డ‌క్‌వ‌ర్త్ లూయిస్ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. మ్యాచ్‌ను కొన‌సాగించాల్సి ఉంటుంది.

డ‌క్‌వ‌ర్త్ లూయిస్ నిబంధ‌న‌..య‌మ‌పాశ‌మే!

ల‌క్ష్యాన్ని ఛేదించడానికి బ‌రిలో దిగిన జ‌ట్టుకు డ‌క్‌వ‌ర్త లూయిస్ నిబంధ‌న ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో మ‌న‌కు తెల‌సు. దీనికి నిద‌ర్శ‌నాలు చాలా ఉన్నాయి. రెండోసారి బ్యాటింగ్‌కు దిగిన జ‌ట్టుకు డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ఓ య‌మపాశంలాంటిదే. ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా మొద‌టికే మోసం వ‌స్తుంది. అస‌లుకే ఎస‌రు తెచ్చిపెడుతుంది. ప్ర‌స్తుతం టీమిండియా అలాంటి సంక‌ట స్థితినే ఎదుర్కొంటోంది. తొలి సెమీ ఫైన‌ల్ రెండోరోజు ఆట..యునైటెడ్ కింగ్‌డ‌మ్ కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 10:30 గంట‌ల‌కు ఆరంభం అవుతుంది. మ్యాచ్‌కు వేదిక‌గా మారిన మాంచెస్ట‌ర్‌లో మంగ‌ళ‌వారం సాయంత్రం వ‌ర‌కూ వ‌ర్షం కురిసింది. ప్ర‌స్తుతం అక్క‌డ అడ‌పాద‌డ‌పా తేలిక‌పాటి జ‌ల్లులు త‌ప్ప భారీ వ‌ర్షమేదీ న‌మోదు కాలేదు.

మ‌ధ్యాహ్నం త‌రువాత వ‌ర్షం..

బుధ‌వారం ఉద‌యం వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అక్క‌డి వాతావ‌ర‌ణ శాఖ అధికారుల అంచ‌నా. ఉద‌యం ఆకాశం మేఘావృతమై ఉంటుంద‌ని, మ‌ధ్యాహ్నం త‌రువాత ఓ మోస్త‌రు వ‌ర్షం ప‌డే అవ‌కాశ ఉంద‌ని మాంచెస్ట‌ర్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు త‌మ అధికారిక ట్విట‌ర్‌లో వెల్ల‌డించారు. యుకే కాల‌మానం ప్ర‌కారం.. ఉద‌యం 10:30 గంట‌ల‌కు మ్యాచ్ ఆరంభం కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌ధ్యాహ్నం త‌రువాత వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు ఉన్నందున‌.. ఓవ‌ర్ల‌ను కుదించ‌డానికే అంపైర్లు మొగ్గు చూపుతారు. ఓవ‌ర్ల‌ను కుదించిన త‌రువాత టీమిండియా ల‌క్ష్యాన్ని ఛేదించ‌డానికి బ‌రిలో దిగాల్సి వ‌స్తే.. అంత చ‌లిలోనూ చెమ‌ట‌లు ప‌ట్ట‌డం ఖాయం.

మ్యాచ్ కొన‌సాగితే.. ప‌రిస్థేంటీ..

ఓవ‌ర్లు కుదించిన త‌రువాత మ్యాచ్‌ను కొన‌సాగించాల్సి వ‌స్తే.. టీమిండియా క‌ఠిన ప‌రిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. టీమిండియా విజ‌య ల‌క్ష్యం 20 ఓవ‌ర్ల‌లో 148 ప‌రుగులు చేయాల్సి ఉంటుంది. వ‌ర్షం వ‌ల్ల ఈ 20 ఓవ‌ర్ల‌లో ఒక్క ఓవ‌ర్ బంతి త‌క్కువ‌గా ఆడినా కోహ్లీసేన‌కు ఎలాంటి ఆందోళ‌న ఉండదు గానీ.. కొన‌సాగితే మాత్రం ల‌క్ష్యాన్ని అందుకోవ‌డం క‌ష్ట‌మే అవుతుంది. గ్రౌండ్‌లో ఇప్పుడు నెల‌కొన్న ప‌రిస్థితుల్లో 20 ఓవ‌ర్ల‌లో 48 ప‌రుగులు చేయ‌డ‌మంటే క‌ష్ట‌సాధ్యమౌతుంది. పిచ్‌పై బంతి ఎక్కువ ఎత్తుకు ఎగ‌ర‌దు. బ్యాట్ మీదికి రాదు. పిచ్‌పై తేమ చేరుకున్నందున బంతి బౌన్స్ అవ్వ‌దు. భారీ షాట్ కొట్టిన‌ప్ప‌టికీ.. గ్రౌండ్ బుర‌ద‌మ‌యం కావ‌డం వ‌ల్ల బంతి ఆశించిన వేగంగా బౌండ‌రీ లైన్‌ను తాక‌దు. ఈ ప‌రిస్థితుల్లో 20 ఓవ‌ర్లో 48 ప‌రుగుల‌ను చేయ‌డానికి టీమిండియా బ్యాట్స్‌మెన్లు తీవ్రంగా శ్ర‌మించాల్సి ఉంటుంది.

1
43689

{headtohead_cricket_3_4}

Story first published: Wednesday, July 10, 2019, 10:56 [IST]
Other articles published on Jul 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+