టీమిండియా వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా మరోసారి కౌంటిల్లో ఆడనున్నాడు. చాలా కాలంగా ఫాంలో లేక ఇబ్బంది పడుతున్న పుజారా ఇంగ్లండ్‌లోని కౌంటీ జట్టైనా ససెక్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది కౌంటీ సీజన్‌కు దూరమైన ససెక్స్ ఆటగాడు ట్రావిస్ హెడ్ స్థానంలో పుజారాకు జట్టులో చోటు దక్కింది. దీంతో పుజారా త్వరలోనే ఇంగ్లండ్ పయనం కానున్నాడు. టోర్నీ మొత్తం ఆడనున్నాడు. ఈ విషయాన్ని చటేశ్వర్ పుజారే అధికారికంగా ప్రకటించాడు. రాబోయే కౌంటీ సీజన్లో ససెక్స్ జట్టులో భాగమైనందుకు తాను సంతోషిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ససెక్స్ జట్టుతో చేరేందుకు ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. కొన్ని సంవత్సరాలుగా కౌంటీల్లో ఆడుతున్నానని, అయితే తొలిసారి ససెక్స్ జట్టుకు ఆడనుండడం సంతోషాన్నిస్తుందని చెప్పాడు. జట్టు విజయం కోసం తన వంతు పాత్ర పోషిస్తానని పుజారా తెలిపాడు. మొత్తంగా కౌంటీల్లో సత్తా చాటి చటేశ్వర్ పుజారా మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడెమే చూడాలి.
ఫేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న చటేశ్వర్ పుజారా భారత జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. స్వదేశంలో శ్రీలంకతో జరగుతున్న టెస్టు సిరీస్‌కు సెలెక్టర్లు ఈ సీనియర్ బ్యాటర్‌ను ఎంపిక చేయలేదు. దీంతో మెగా వేలంలో సైతం పుజారాను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. దీంతో ఫామ్ కోసం రంజీ ట్రోఫీలో ఆడాడు. సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన పుజారా అక్కడ కూడా రాణించలేకపోయాడు. ఇప్పటివరకు 191 పరుగులు మాత్రమే చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 95 టెస్టు మ్యాచ్‌లు ఆడిన పుజారా 43 సగటుతో 6713 పరుగులు చేశాడు. ఇందులో 18 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మూడు సార్లు డబుల్ సెంచరీ మార్క్‌ను కూడా అందుకున్నాడు. అత్యధిక స్కోర్ 206గా ఉంది.