ఆఫ్ఘన్‌తో ఏకైక టెస్టు, ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు: మే 8న భారత జట్టు ప్రకటన

హైదరాబాద్: ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టును మే 8న ప్రకటించనున్నారు. అదే రోజున యూకే పర్యటనకు వెళ్లే భారత జట్టును, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత ఏ జట్టునూ ప్రకటిస్తామని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు గురువారం తెలిపారు. కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడటం ఖాయం కావడంతో ఆప్ఘన్‌తో జరిగే ఏకైక టెస్టుకు దూరం కానున్నాడు.
'మే 8న జరుగనున్న సెలెక్షన్స్‌లో మూడు జట్ల ఎంపిక జరుగుతుంది. అప్ఘన్ టెస్టు కోసం బరిలో దిగే టెస్టు జట్టు, ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్‌లో జరగనున్న రెండు వన్డేల సిరీస్ కోసం వన్డే జట్టుతో పాటు ఇంగ్లండ్‌లో పర్యటించనున్న భారత 'ఎ' జట్టును కూడా ప్రకటిస్తాం' అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
టెస్టు హోదా దక్కిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్ తమ అరంగేట్రం మ్యాచ్‌ను భారత్‌తో జూన్ 14 నుంచి 18 వరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. అదే సమయలో కౌంటీ మ్యాచ్‌లు ఆడనున్న విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా, ఇషాంత్‌శర్మ ఆఫ్ఘన్‌తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు దూరం కానున్నారు.
ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత ఆటగాళ్లు అక్కడి పరిస్థితులపై అవగాహన వచ్చేందుకు 'ఎ' జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. రహానే, మురళీ విజయ్, రోహిత్, హార్దిక్ పాండ్యాలను 'ఎ' జట్టుతో పాటు అక్కడికి పంపితే అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తోంది.
ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్‌తో భారత్ రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. జూన్‌లోనే భారత్-ఏ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications