Under-19 World Cup: వరల్డ్‌కప్‌నకు టీమిండియా ఎంపిక.. వైస్ కెప్టెన్‌గా తెలుగోడు

వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరగనున్న అండర్-19 వరల్డ్ కప్ కోసం ఆల్ ఇండియా జూనియర్ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. మొత్తం 17 మందితో కూడిన జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. ఈ జట్టుకు యష్ ధుల్ నాయకత్వం వహించనున్నాడు. తెలుగు కుర్రాడు షేక రషీద్ వైస్ కెప్టెన్‌గా ఎంపికవడం విశేషం. రషీద్‌ది ఏపీలోని గుంటూర్ జిల్లా. అంతేకాకుండా స్టాండ్‌బై ఆటగాడిగా మరో తెలుగువాడైన రిషిత్‌రెడ్డి కూడా ఎంపికయ్యాడు. రిషిత్ రెడ్డిది తెలంగాణలోని హైదరాబాద్.

భారత జట్టు
యశ్ ధుల్ (కెప్టెన్), ఎస్‌కే రషీద్ (వైస్ కెప్టెన్), హర్నూర్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, నిశాంత్ సింధు, సిద్దార్థ్ యాదవ్, అనీశ్వర్ గౌతమ్, దినేష్ బానా (వికెట్ కీపర్), ఆరాధ్య యాదవ్ (వికెట్ కీపర్), రాజ్ అంగద్ బావా, మానవ్ పరాఖ్, కౌశల్ తాంబే , ఆర్ ఎస్ హంగర్గేకర్, వాసు వాట్స్, విక్కీ ఓస్త్వాల్, రవికుమార్, గర్వ్ సంగ్వాన్.
స్టాండ్‌బై ఆటగాళ్లు:
రిషిత్ రెడ్డి, ఉదయ్ సహారన్, అన్ష్ గోసాయి, అమృత్ రాజ్ ఉపాధ్యాయ్, పీఎం సింగ్ రాథోడ్

ఏ గ్రూప్‌లో ఏం టీం?
ఈ అండర్ -19 వరల్డ్‌కప్ 2022.. 14వ ఎడిషన్. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 మధ్య జరగనుంది. మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. 16 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. కాగా భారత్ గ్రూప్-బీలో ఉంది. గ్రూప్-బీలో భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఉగాండ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్‌తో పాటు ఇంగ్లాండ్, కెనడా యూఏఈ ఉన్నాయి. గ్రూప్ -సిలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, పపువా న్యూగినియా, జింబాబ్వే ఉన్నాయి. ఇక గ్రూప్ -డిలో ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, శ్రీలంకలు ఆతిథ్య వెస్టిండీస్‌తో కలిసి ఉన్నాయి. ఆంటిగ్వా, బార్బుడా, గయానా, సెయింట్ కిట్స్, నెవిస్, ట్రినిడాడ్, టొబాగో వంటి 10 వేదికలపై మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి.

భారత్ ఇప్పటి వరకు ఎన్ని సార్లు?
అండర్-19 ప్రపంచకప్‌ను భారత జట్టు ఇప్పటివరకు 4 సార్లు గెలుచుకుంది. 2000, 2008, 2012, 2018 ఎడిషన్లలో టీమిండియా విజేతగా నిలిచింది. ఈ సారి కూడా భారత జట్టు టైటిల్ ఫెవరేట్‌గా బరిలోకి దిగుతోంది. కాగా వరల్డ్‌కప్-2022లో జనవరి 14 నుంచి 22 వరకు గ్రూప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. జనవరి 26 నుంచి 29 వరకు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో సెమీఫైనల్స్, ఫిబ్రవరి 5వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ముగుస్తుంది.

భారత్ మ్యాచ్‌లు ఎప్పుడు?
భారత్ గ్రూప్ స్టేజీలో తమ తొలి మ్యాచ్‌ను జనవరి 15న గయానా స్టేడియంలో దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. ఇక రెండో మ్యాచ్‌ను ట్రినిడాడ్‌లో ఐర్లాండ్‌తో జనవరి 19న ఆడుతుంది. ఇక చివరి లీగ్ మ్యాచ్‌లో ట్రినిడాడ్ స్టేడియంలో జనవరి 22ను ఉగాండాతో తలపడుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications