Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Prithvi Shaw: జరిగేదంతా మీరు చూస్తున్నారు సాయి బాబా.. వైరల్ అవుతున్న పృథ్వీ షా పోస్ట్..

Team Indias young player Prithvi Shahs Instagram post goes viral

BCCI చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనల కోసం మొత్తం నాలుగు జట్లను ప్రకటించారు. నవంబర్ 18 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టీ20లు ఆడనున్న భారత్, అదే జట్టుతో మూడు వన్డేలు ఆడనుంది.

అలాగే మూడు మ్యాచ్‌ల ODI సిరీస్, రెండు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. అయితే బీసీసీఐ ప్రకటించిన టీమ్ లో పృథ్వీ షాకు చోటు దక్కలేదు.

చేతన్ శర్మ

చేతన్ శర్మ

షాను ఎంపిక చేయకపోవడంపై భారత చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. షాపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని, భవిష్యత్తులో అతనికి అవకాశం లభిస్తుందని అన్నారు. జట్టు సెటప్‌లో ఇప్పటికే మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లకు సెలక్షన్ కమిటీ అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యమని చేతన్ శర్మ చెప్పాడు. అయితే, షా "ఖచ్చితంగా తన అవకాశం పొందుతారు" అని పునరుద్ఘాటించాడు.

ఇన్‌స్టాగ్రామ్

ఇన్‌స్టాగ్రామ్

అయితే, స్క్వాడ్‌లను ప్రకటించిన కొద్ది నిమిషాల తర్వాత షా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేశాడు. సాయి బాబా ఫొటో పోస్ట్ చేశాడు. ఫొటోతో పాటు జరిగేదంతా మీరు చూస్తున్నారు సాయి బాబా అంటూ రాసుకొచ్చాడు. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్లు ఇలా ఉన్నాయి.

టీ20 జట్టు:

టీ20 జట్టు:

హార్దిక్ పాండ్యా(కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), సంజ్ శాంసన్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీద్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రన్ మాలిక్.

వన్డే జట్టు:

శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్స్ అయ్యరు, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సంజ్ శాంసన్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షర్దుల్ ఠాగూర్, షబాద్ అహ్మద్, చాహల్, కుల్దీప్ యాదవ్, హర్ష్ దీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రన్ మాలిక్.

వన్డే జట్టు:

వన్డే జట్టు:

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదారు, శ్రేయస్స్ అయ్యర్, రాహుల్ త్రిపాఠీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, షర్దుల్ ఠాగూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యాష్ దయాల్.

టెస్ట్ జట్టు:

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఛటేశ్వర పుజరా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కేఎస్ భారత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, షర్దుల్ ఠాగూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్.

Story first published: Tuesday, November 1, 2022, 8:54 [IST]
Other articles published on Nov 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+