For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India tour of New Zealand 2020: పేలవ రికార్డు, బుమ్రా తొలిసారి, ఆసక్తికర విషయాలివే!

Team Indias tour of New Zealand 2020: Unknown facts about series

హైదరాబాద్: ఆస్ట్రేలియాపై 2-1తో వన్డే సిరీస్‌ విజయం ఇచ్చిన ఉత్సాహంతో టీమిండియా కివీస్ గడ్డపై ఆరు వారాల సుదీర్ఘ పర్యటనకు బయల్దేరి వెళ్లింది. ఈ పర్యటన కోసం ఇప్పటికే ఆక్లాండ్‌కు చేరుకున్న టీమిండియా కివీస్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 5 టీ20లు, 3 వన్డేలతో పాటు 2 టెస్టులు ఆడనుంది.

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఇరు జట్ల మధ్య శుక్రవారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనుంది. 2009, 2019 సిరీస్‌లను పక్కన పెడితే న్యూజిలాండ్‌లో అడుగుపెట్టి టీమిండియా వన్డే సిరీస్‌ గెలిచిన దాఖలాలు లేవు. దీంతో ఈ సిరిస్‌ను కోహ్లీసేన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

కివీస్‌ గడ్డపై విజయం సాధించాలని

కివీస్‌ గడ్డపై విజయం సాధించాలని

కివీస్‌ గడ్డపై విజయం సాధించి సత్తా చాటాలని టీమిండియా ఆతృతగా ఉంది. న్యూజిలాండ్ పర్యటన పర్యటన అంటేనే సవాల్‌తో కూడుకుని ఉంటుంది. అందుకు కారణం కివీస్ గడ్డపై స్వింగ్‌, సీమ్‌కు అనుకూలించే పిచ్‌లు ఉంటాయి. మరోవైపు వణికించే చలి... న్యూజిలాండ్ వాతావరణం భిన్నంగా ఉంటుంది. అయితే, ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరిస్ టీమిండియాకు ఓ చక్కని ప్రాక్టీస్ సిరిస్‌గా ఉపయోగపడనుంది.

అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులు

అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులు

ముఖ్యంగా ప్రపంచకప్ ఆడే సమయానికి అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులు తదితర అంశాలపై ఆటగాళ్లు పూర్తిస్థాయిలో అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఆరు వారాల పర్యటన కావడంతో ఈ టూర్ కోహ్లీసేనకు ఎంతో కీలకం కానుంది. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ హైదరాబాద్ వేదికగా 1955లో జరిగింది. అప్పటి నుండి ఇరు జట్లు ద్వైపాక్షికంగా 57 టెస్టులు, 65 వన్డేలు, 10 టీ20లు జరిగాయి. ఇందులో భారత్ 21 టెస్టులు, 33 టెస్టులు, 2 టీ20ల్లో విజయం సాధించింది.

న్యూజిలాండ్‌తో టీ20ల్లో పేలవ రికార్డు

న్యూజిలాండ్‌తో టీ20ల్లో పేలవ రికార్డు

ఇక, న్యూజిలాండ్ విషయానికి వస్తే 10 టెస్టులు, 26 వన్డేలు, 6 టీ20లు నెగ్గింది. ప్రపంచంలోని మిగతా టీ20 జట్లతో పోలిస్తే న్యూజిలాండ్‌తో టీ20ల్లో గెలుపు, ఓటముల నిష్పత్తి చాలా 0.375గా నమోదైంది. అలాంటిది టీ20 సిరిస్‌తోనే న్యూజిలాండ్ పర్యటనను ఇప్పుడు టీమిండియా ఆరంభించడం చాలా ఆసక్తికరంగా మారింది. న్యూజిలాండ్‌లో 2008-09లో, 2014లో పర్యటించిన టీమిండియా టీ20 సిరీస్‌లో నెగ్గలేదు. 2017 నవంబర్‌లో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ కివీస్ గడ్డపై తొలిసారిగా ఓ టీ20 సిరిస్‌లో విజయం సాధించింది.

న్యూజిలాండ్‌ పర్యటన తొలిసారి

న్యూజిలాండ్‌ పర్యటన తొలిసారి

భారత జట్టులోని పలువురు ఆటగాళ్లకు ఈ న్యూజిలాండ్‌ పర్యటన తొలిసారి కావడం విశేషం. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌తో కివీస్ గడ్డపై తొలి మ్యాచ్ ఆడనున్నాడు. 2019 ఆరంభంలో జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇక, 78 అంతర్జాతీయ టీ20లు ఆడిన విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ గడ్డపై ఈ సిరీస్‌తో తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నాడు.

న్యూజిలాండ్‌లో టెస్ట్ సిరీస్ గెలిచినప్పుడు

న్యూజిలాండ్‌లో టెస్ట్ సిరీస్ గెలిచినప్పుడు

టీమిండియా చివరిగా అంటే 2009లో న్యూజిలాండ్‌లో టెస్ట్ సిరీస్ గెలిచినప్పుడు.. ప్రస్తుతం వన్డే జట్టులో చోటు దక్కించుకున్న పృథ్వీ షా వయస్సు 10 సంవత్సరాలు. కివీస్ గడ్డపై టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. కివీస్ గడ్డపై ఓపెనర్ రోహిత్ శర్మ అత్యధిక స్కోర్ 87.

టీ20 షెడ్యూల్

టీ20 షెడ్యూల్

1st T20I - జనవరి 24 (శుక్రవారం): ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌ (12:30 PM IST)

2nd T20I - జనవరి 26 (ఆదివారం): ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌ (12:30 PM IST)

3rd T20I - జనవరి 29 (బుధవారం): హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌ (12:30 PM IST)

4th T20I - జనవరి 31 (శుక్రవారం): వెల్లింగ్‌టన్‌లోని వెస్ట్‌పాక్ స్టేడియం (12:30 PM IST)

5th T20I - ఫిబ్రవరి 2 (ఆదివారం): మౌంట్ మౌంగనుయ్ బే ఓవల్ (12:30 PM IST)

వన్డే షెడ్యూల్

1st ODI - ఫిబ్రవరి 5 (బుధవారం): హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో (7:30 AM IST)

2nd ODI - ఫిబ్రవరి 8 (శనివారం): ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో (7:30 AM IST)

3rd ODI - ఫిబ్రవరి 11 (మంగళవారం): మౌంట్ మౌంగనుయ్ బే ఓవల్ వద్ద (7:30 AM IST)

ఫిబ్రవరి 14-16: మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్, సెడాన్ పార్క్, హామిల్టన్ (3:30 AM IST)

టెస్ట్ షెడ్యూల్

1st Test - ఫిబ్రవరి 21-25: బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ (4:00 AM IST)

2nd Test - ఫిబ్రవరి 29-మార్చి 4: హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్ (4:00 AM IST)

Story first published: Wednesday, January 22, 2020, 18:36 [IST]
Other articles published on Jan 22, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+