Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐర్లాండ్‌తో తొలి టీ20: డబ్లిన్‌లో టీమిండియా నెట్ ప్రాక్టీస్

Team Indias practice session in Dublin

హైదరాబాద్: టీమిండియా సుదీర్ఘ క్రికెట్‌కు సిద్ధమైంది. రెండున్నర నెలల పాటు సాగే ఇంగ్లాండ్‌ పర్యటనకు బుధవారమే శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఐర్లాండ్‌తో టీ20 సిరిస్‌కు సిద్ధమైంది. ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20ల సిరీస్‌కు డబ్లిన్‌ ఆతిథ్యమివ్వనుంది.

ఈ నేపథ్యంలో మంగళవారం లండన్‌ నుంచి బయలుదేరి డబ్లిన్‌ చేరుకుంది. అనంతరం టీమిండియా ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ కోహ్లీ, ధోని, బుమ్రా, రోహిత్ శర్మలతో పాటు పలువురు ఆటగాళ్లు పాల్గొన్నారు.

అన్నింట్లోనూ టీమిండియాదే విజయం

ఇప్పటివరకు ఐర్లాండ్‌తో టీమిండియా మూడు వన్డేలు, ఒక టీ20 ఆడగా అన్నింట్లోనూ టీమిండియాదే విజయం. ఐర్లాండ్‌తో జరిగే ఈ సిరీస్‌ను గెలుచుకుని ఇంగ్లాండ్‌ పర్యటనను ఘనంగా ఆరంభించాలని కోహ్లీసేన చూస్తోంది. ఇంగ్లాండ్‌ సిరీస్‌కు ముందు ఐర్లాండ్‌ సిరీస్‌ను భారత్‌ చిన్నపాటి సన్నాహకంగా భావిస్తోంది.

టీ20ల్లో నంబర్‌వన్‌ స్థానంపై కన్నేసిన టీమిండియా

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీసేన టీ20ల్లో కూడా నంబర్‌వన్‌ స్థానంపై కన్నేసింది. ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌ల్లో కోహ్లీసేన విజయం సాధిస్తే దాయాది దేశమైన పాకిస్థాన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు ఐర్లాండ్‌తో సిరీస్‌ను భారత్‌ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు.

జులై 3 నుంచి ఇంగ్లాండ్‌తో టీ20 సిరిస్

చిన్న జట్టే అయినప్పటికీ, ఆ జట్టులో కూడా కెవిన్‌, పోర్టర్‌ఫీల్డ్‌, స్టిర్లింగ్‌, డాక్రెల్‌ లాంటి నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరిస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో జులై 3 నుంచి టీ20 సిరిస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత మూడు వన్డేలు, ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

ముందు పరిమిత ఓవర్ల సిరిస్, తర్వాత టెస్టు సిరిస్

ముందు పరిమిత ఓవర్ల సిరిస్, తర్వాత టెస్టు సిరిస్

టెస్టు సిరీస్‌ ఆరంభమయ్యే సమయానికి అక్కడి పరిస్థితులకు టీమిండియా ఆటగాళ్లు అలవాటు పడేందుకు గాను సిరిస్‌ను ఇలా ప్లాన్ చేశారు. ఇంగ్లాండ్‌లో గత రెండు టెస్టు సిరీస్‌ల్లోనూ ఘోరంగా ఓటమిపాలైన టీమిండియా ఈసారి మాత్రం ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో ఉంది.

రాత్రి 8.30 నుంచి సోనీ సిక్స్‌లో

Story first published: Wednesday, June 27, 2018, 14:13 [IST]
Other articles published on Jun 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+