ఇప్పటివరకు టీమిండియా ఎన్ని టీ20 సిరిస్ విజయాలను నెగ్గిందో తెలుసా?

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనను విజయవంతంగా ముగించుని స్వదేశానికి తిరిగొచ్చిన భారత జట్టు మార్చి 5 నుంచి 16 వరకు శ్రీలంక వేదికగా జరిగే ముక్కోణపు సిరిస్‌కు సన్నద్ధం అవుతుంది. శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నిదాహాస్ ట్రోఫీ పేరిట ఓ ముక్కోణపు సిరిస్‌ను నిర్వహిస్తోంది.
ఈ ముక్కోణపు టీ20 సిరిస్‌లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు పాల్గొంటున్నాయి. ఈ సిరిస్‌కు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనిలతో పాటు పలువురు సీనియర్లు క్రికెటర్లకు విశ్రాంతినిచ్చి యువ క్రికెటర్లకు అవకాశం కల్పించారు. ఈ సిరిస్‌కు గాను టీమిండియాకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు.
2006-07 తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకలో ఆడటం ఇదే మొట్టమొదటి సారి. టీమిండియా ఇప్పటివరకు 94 టీ20 మ్యాచ్‌లాడగా అందులో 57 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా... 34 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఒక్క మ్యాచ్ టైగా ముగియగా, రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి.
టీమిండియా తన మొట్టమొదటి టీ20 మ్యాచ్‌ని దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్ వేదికగా ఆడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు టీమిండియా అనేక ద్వైపాక్షిక టీ20 సిరిస్‌లతో పాటు ఐసీసీ వరల్డ్ టీ20, ఆసియా కప్ లాంటి టోర్నీల్లో కూడా ఆడింది.
అయితే, శ్రీలంక వేదికగా జరిగే నిదాహాస్ ట్రోఫీ మాత్రం టీమిండియాకు తొలిసారి కావడం విశేషం. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని లేకుండా శ్రీలంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా గత 11 ఏళ్లలో విదేశాల్లో ఎన్ని సిరిస్‌లను గెలిచిందో ఒక్కసారి పరిశీలిద్దాం...

ఐసీసీ వరల్డ్ టీ20, దక్షిణాఫ్రికా 2007
ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా విజయం సాధించడం భారత క్రికెట్ చరిత్రనే మార్చిందనే చెప్పుకోవాలి. ధోని సారథ్యంలోని టీమిండియా ట్రోఫీని కైవసం చేసుకుని ప్రపంచ విజేతగా నిలిచింది. అంతకముందు అదే ఏడాది ప్రారంభంలో జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఘోర వైఫల్యం అనంతరం భారత జట్టు ఈ వరల్డ్ కప్ నెగ్గడం అభిమానులను ఆనందానికి గురి చేసింది. ఆ తర్వాత ఏడాది భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైంది. ఆ తర్వాత ఐపీఎల్ ప్రపంచంలో క్యాష్ రిచ్ టోర్నీగా ఎలాగ మారిందో అందరికీ తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా పాకిస్థాన్‌ను రెండు సార్లు ఓడించగా, ఇంగ్లాండ్, దక్షిణాఫఅరికా, ఆస్ట్రేలియాలపై కూడా విజయం సాధించింది. కేవలం ఒక్క న్యూజిలాండ్ చేతిలో మాత్రమే ఓటమిపాలైంది.

జింబాబ్వేపై 2-0తో విజయం, 2010
విదేశీ గడ్డపై ఓ ద్వైపాక్షిక సిరిస్‌లో టీమిండియా నెగ్గడం ఇదే మొట్టమొదటిసారి. సురేశ్ రైనా కెప్టెన్సీలోని టీమిండియా హరారే వేదికగా జరిగిన తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించగా, రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకముందు ఇదే గడ్డపై జరిగిన ముక్కోణపు వన్డే సిరిస్ పైనల్లో శ్రీలంక చేతిలో టీమిండియా ఓటమిపాలైంది.

బంగ్లాదేశ్‌లో ఆసియాకప్‌లో విజయం, 2016
బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో ధోని సారథ్యంలోని టీమిండియా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్‌గా అవతరించింది. టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 45 పరుగులు తేడాతో విజయం సాధించిన టీమిండియా, ఫైనల్లో అదే బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టోర్నీలో భాగంగా జరిగిన మిగతా మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌పై 5 వికెట్లు, లంకపై 5 వికెట్లు, యుఏఈపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఆస్ట్రేలియాపై 3-0తో విజయం, 2016
విదేశీగడ్డపై టీ20ల్లో ఇప్పటివరకు టీమిండియా చేసిన అద్భుత ప్రదర్శన ఇదే. 2015-16లో ఆసీస్ పర్యటనకు వెళ్లిన ధోని నేతృత్వంలోని భారత జట్టు వన్డే సిరిస్‌ను 1-4తో చేజార్చుకుంది. అనంతరం జరిగిన మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకుని పరువు నిలబెట్టుకుంది. ఈ సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు లభించింది. అడిలైడ్, మెల్ బోర్న్ వేదికగా జరిగిన తొలి రెండు గేముల్లో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టీ20లో సురేశ్ రైనా మెరుపులు మెరిపించాడు.

జింబాబ్వేపై 2-1తో విజయం, 2016
సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి ఇచ్చి కేవలం యువ క్రికెటర్లతో ధోని సారథ్యంలోని టీమిండియా మూడు టీ20ల సిరిస్ ఆడింది. ఈ టీ20 సిరిస్‌కు బీసీసీఐ సీనియిర్ క్రికెటర్లను కాకుండా యువ క్రికెటర్లను జింబాబ్వే పర్యటనకు పంపడంపై అప్పటి తాత్కాలిక కోచ్ మకాయ ఎన్తిని తీవ్రంగా మండిపడ్డారు. వన్డే సిరిస్‌ను 0-3తో చేజార్చుకున్న జింబాబ్వే తొలి టీ20లో విజయం సాధించి ధోనిసేనకు పోటీ ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన రెండు టీ20ల్లో కూడా ఓటమి పాలవ్వడంతో 2-1తో సిరిస్‌ను ధోని సైన కైవసం చేసుకుంది. ఆఖరి టీ20లో టీమిండియా కేవలం 3 పరుగుల తేడాతో విజయం సాధంచడం విశేషం.

2-1తో దక్షిణాఫ్రికాపై విజయం, 2018
58 రోజుల సుదీర్ఘ సఫారీ పర్యటనను కోహ్లీసేన విజయంతో ముగించింది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 1-2తో చేజార్చుుకున్నప్పటికీ, ఆ తర్వాత జరిగిన వన్డే, టీ20 సిరిస్‌ను నెగ్గింది. ఆరు వన్డేల సిరిస్‌ను 5-1తో కైవసం చేసుకుని, మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకుని సఫారీ గడ్డపై వరుసగా రెండు సిరిస్‌లను నెగ్గిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. మూడు టీ20ల సిరిస్‌లో తొలి టీ20లో భారత్ నెగ్గగా, రెండో టీ20లో సఫారీలు విజయం సాధించారు. దీంతో మూడో టీ20 ఆసక్తికరంగా మారింది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వెన్నునొప్పితో దూరం కాగా, రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications