Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్: భారత కాలమాన ప్రకారం టీమిండియా మ్యాచ్‌లు, వివరాలు

న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ కప్‌కు ఆహ్వానం పలికే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టోర్నమెంట్లో అడుగుపెడుతున్న ధోని సేన మళ్లీ వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోవాలని క్రికెట్ అభిమానులు భావిస్తుంటే.... క్రికెట్ విశ్లేషకులు మాత్రం టైటిల్ బరిలో టీమిండియా నిలిచే అవకాశాలు తక్కువేనని అంటున్నారు.

ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు మొత్తం 44 రోజులు టోర్నమెంట్ జరగనుంది. ఈ ఏడాది టోర్నమెంట్‌ను ఆస్టేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భారత్ క్రికెట్ అభిమానులు మ్యాచ్‌లను వీక్షించాలంటే ఉదయం పూటనే వీక్షించాలి.

అందుకు కారణం భారత కాలమానం ప్రకారం భారత్ మ్యాచ్‌లన్నీ తెల్లవారుజామున 3.30కే మొదలవుతుండటమే. ఈ సారి వరల్డ్ కప్ ఆస్టేలియాలో జరుగుతుండటంతో టీమిండియాకు క్వార్టర్ ఫైనల్‌కు అవకాశాలున్నాయి. ఆ తర్వాత స్టేజి నుంచి అసలు క్రికెట్ మొదలవనుంది.

ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భారత్ ఫిబ్రవరి 15న తన తొలి మ్యాచ్ చిరకాల ప్రత్యర్ధి పాకిస్ధాన్ మ్యాచ్‌తో అరంగేట్రం చేయనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడయ్యాయని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.

పూల్ బిలో భారత్:

Team India's ICC World Cup 2015 schedule in IST and squad

పాకిస్తాన్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఐర్లాండ్, వెస్ట్ ఇండీస్, జింబాబ్వేలతో పాటు పూల్ బిలో భారత్ ఉంది. (నాకౌట్ దశకు టాప్ 2 అర్హత సాధిస్తాయి)

భారత కాల మానం ప్రకారం డే/నైట్ మ్యాచ్‌ల వివరాలు:

15 ఫిబ్రవరి (ఆదివారం) - భారత్ Vs పాకిస్తాన్ (అడిలైడ్) 9 AM

22 ఫిబ్రవరి (ఆదివారం) - భారత్ Vs సౌత్ ఆఫ్రికా (మెల్బోర్న్) 9 AM

28 ఫిబ్రవరి (శనివారం) - భారత్ Vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (పెర్త్) 12 PM

6 మార్చి (శుక్రవారం) - భారత్ Vs వెస్ట్ ఇండీస్ (పెర్త్) 12 PM

10 మార్చి (మంగళవారం) - భారత్ Vs ఐర్లాండ్ (హమిల్టన్) 6.30 AM

14 మార్చి (శనివారం) - భారత్ Vs జింబాబ్వే (ఆక్ల్యాండ్) 6.30 AM

18 మార్చి (బుధవారం) --- క్వార్టర్ ఫైనల్స్

29 మార్చి --- పైనల్స్ (మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్)

భారత జట్టు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ (వైస్-కెప్టెన్), అజింక్య రహానె, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, స్టువర్ట్ బిన్నీ, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, అక్షర పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షామీ, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+