Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Test Rankings: టీమిండియా మళ్లీ నంబర్‌వన్‌.. రెండో స్థానంలో న్యూజిలాండ్!!

Team India retain top spot in ICC Test Team rankings
IND VS NZ WTC Finals : India Retain Top Spot In ICC Test Team Rankings || Oneindia Telugu

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మళ్లీ అగ్రస్థానానికి దక్కించుకుంది. గురువారం ప్రకటించిన యాన్యువల్ అప్‌డేట్‌లో టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత్ నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. 121 రేటింగ్‌ పాయింట్లతో భారత్‌ నంబర్‌వన్‌ ర్యాంకును పదిలం చేసుకోగా.. 120 పాయింట్లతో న్యూజిలాండ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఒక్క పాయింట్‌ మాత్రమే తేడా ఉంది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముంగిట భారత జట్టుకి ఇది ఉత్సాహానిచ్చే వార్త అని చెప్పాలి.

భారత్‌ మొత్తంగా 24 మ్యాచుల్లో 2914 పాయింట్లు అందుకొంది. మరోవైపు న్యూజిలాండ్‌ 18 టెస్టులాడి మొత్తం 2166 పాయింట్లు సంపాదించింది. ఆసీస్‌పై 2-1, ఇంగ్లండ్‌పై 3-1 తేడాతో గెలవడం కోహ్లీసేనకు ఉపయోగపడింది. వెస్టిండీస్‌, పాకిస్థాన్‌పై 2-0 తేడాతో సిరీసులు గెలవడం కివీస్‌ను ముందుకు తీసుకొచ్చాయి. దక్షిణాఫ్రికా పర్యటనను ఆసీస్ రద్దుచేసుకోవడంతో.. కంగారులు టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో నిలవలేకపోయారు. ఐసీసీ 2020 నుంచి జరిగిన మ్యాచులకు 100%, అంతకు ముందు రెండేళ్లకు 50% పాయింట్ల ఆధారంగా రేటింగ్స్‌ ఇచ్చింది.

టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ (109) ఒక స్థానం ఎగబాకి మూడో స్థానంలో నిలవగా.. ఒక స్థానం తగ్గిన ఆస్ట్రేలియా (108) నాలుగుకు పడిపోయింది. పాకిస్థాన్‌ (94), వెస్టిండీస్‌ (84) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచాయి. దక్షిణాఫ్రికా (80), శ్రీలంక (78), బంగ్లాదేశ్ (46), జింబాబ్వే (10) వరుసగా చివరి స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యల్ప స్థాయికి రావడం గమనార్హం.

ఇంగ్లండ్ గడ్డపైకి జూన్ 2న వెళ్లనున్న భారత టెస్టు జట్టు.. అక్కడ న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌లో తలపడనుంది. నెల రోజుల విరామం అనంతరం ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌‌లో ఢీకొట్టబోతోంది. విరామ సమయంలో భారత్ ప్రాక్టీస్ మ్యాచులు ఆడుతూ సన్నద్ధమవనుంది.

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ బౌలర్లు సత్తాచాటారు. జింబాబ్వేతో టెస్ట్‌ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన హసన్‌ అలీ, షాహిన్‌ ఆఫ్రిది, నుమాన్‌ అలీలు కెరీర్ బెస్ట్ ర్యాంకులు అందుకున్నారు. ​హాసన్​ ఆరు, షాహీన్​ తొమ్మిది, నౌమాన్​ ఆరు స్థానాలను ఎగబాకి వరుసగా 14, 22, 46వ ర్యాంకులకు చేరుకున్నారు. తొలి స్థానంలో పాట్ కమిన్స్‌ ఉన్నాడు. బ్యాటింగ్ విభాగంలో కేన్‌ విలియమ్సన్‌ అగ్రస్థానంలో నిలిచాడు.

Story first published: Thursday, May 13, 2021, 16:05 [IST]
Other articles published on May 13, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+