Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Women's T20 World Cup : వర్షం కాపాడేసింది.. టీ20 వరల్డ్ కప్ సెమీస్ చేరుకున్న టీమిండియా!

Team India reaches Semifnals of Womens T20 World Cup

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్ చేరుకుంది. ఐర్లాండ్‌తో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో భారత్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. భారత బ్యాటర్లంతా జిడ్డు బ్యాటింగ్‌తో తలనొప్పి తెప్పించారు. అయితే స్మృతి మంధాన (87), జెమీమా రోడ్రిగెజ్ (19) ఇద్దరూ మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లంతా టెస్టు తరహా ఆటతీరుతో జట్టు స్కోరును వెనక్కే లాగారు. భారత ఓపెనర్ షెఫాలీ వర్మ (29 బంతుల్లో 24), హర్మన్‌ప్రీత్ కౌర్ (20 బంతుల్లో 13) ఇద్దరూ కూడా చాలా దారుణంగా ఆడారు.

 తొలి బంతికే వికెట్..

తొలి బంతికే వికెట్..

అయితే మంధాన, రోడ్రిగెజ్ రాణించడంతో భారత జట్టు 155 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌కు గొప్ప ఆరంభం లభించలేదు. తొలి బంతికే ఐర్లాండ్ ఓపెనర్ అమీ హంటర్ (1) రనౌట్ అయింది. అదే ఓవర్ ఐదో బంతికి ఓర్లా ప్రెండెర్‌గాస్ట్ (0) కూడా అవుటైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ లానా డెలనీ (17 నాటౌట్) చక్కగా బ్యాటింగ్ చేసింది. అలాగో ఓపెనర్‌గా వచ్చిన గాబీ లూయిస్ (32 నాటౌట్) కూడా అద్భుతంగా ఆడింది.

 గెలిచేలా కనిపించిన ఐర్లాండ్..

గెలిచేలా కనిపించిన ఐర్లాండ్..

వీళ్లిద్దరూ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగడంతో పవర్ ప్లే ముగిసే సరికి ఆ జట్టు 44/2 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత మరో వికెట్ కూడా పడకుండా డెలనీ, లూయిస్ జాగ్రత్త పడ్డారు. వీళ్లిద్దరి బ్యాటింగ్ చూస్తే భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఓడిపోతుందేమో? అని అభిమానులు ఆందోళన చెందారు. అంత గొప్పగా బ్యాటింగ్ చేసిందీ జోడీ. అయితే ఛేజింగ్ పవర్‌ప్లే ముగిసిన కాసేపటికే నెమ్మదిగా వర్షం జల్లులు పడటం మొదలైంది.

 వర్షంతో ముగిసిన మ్యాచ్..

వర్షంతో ముగిసిన మ్యాచ్..

ఛేజింగ్ 8వ ఓవర్ ప్రారంభమైన తర్వాత మరింత పెరిగింది. దీంతో ఆటను నిలిపి వేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. వర్షం ఎంత సేపటికీ ఆగకపోవడంతో ఈ మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. భారత్‌కు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మంధానకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా సెమీ ఫైనల్‌కు చేరింది.

Story first published: Monday, February 20, 2023, 22:25 [IST]
Other articles published on Feb 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+