
ఏడు కరోనా కేసులు
ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనను శ్రీలంక ముగించుకుంది. లంక ప్లేయర్స్ స్వదేశానికి బయలుదేరే ముందు ఇంగ్లండ్ జట్టులో ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో ముగ్గురు ప్లేయర్స్ ఉండగా.. నలుగురు సహాయ సిబ్బంది ఉన్నారు. దాంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొలంబోకి వచ్చే ముందే శ్రీలంక టీమ్‌కి కరోనా పరీక్షలు చేయించారు. అప్పుడు ఎవరికీ పాజిటివ్ రాలేదు. దాంతో ప్లేయర్స్ అందరూ కలిసే ఉన్నారు.

మరో పాజిటివ్ కేసు
ఇంగ్లండ్ నుంచి శ్రీలంక ఆటగాళ్లు మంగళవారం సాయంత్రం కొలంబో చేరుకున్నారు. కొలంబోలో అడుగుపెట్టిన శ్రీలంక టీమ్‌కి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌కి పాజిటివ్‌గా తేలింది. దాంతో అతడ్ని వెంటనే ఐసోలేషన్‌కి పంపిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. ఆటగాళ్లను కూడా క్వారంటైన్‌కి తరలించింది. అయితే మరోసారి నిర్వహించిన కరోనా టెస్టుల్లో శ్రీలంక క్రికెటర్లందరికి నెగటివ్ వచ్చినా.. డేటా అనలిస్ట్ జీటీ నిరోషన్‌కి పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. దాంతో శ్రీలంక టీమ్ క్వారంటైన్ గడువును లంక బోర్డు పొడిగించింది.
WI vs AUS 1st T20: ఆండ్రీ రసెల్ విధ్వంసం.. టీ20లో తొలి హాఫ్ సెంచరీ! ఆస్ట్రేలియాకి భారీ షాక్!!

హోటెల్లోనే ధావన్ సేన
శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత్ జట్టు జూన్ నెల చివర్లోనే కొలంబోకి చేరుకుని.. క్వారంటైన్ అయ్యారు. ఆ తర్వాత కొలంబో మైదానంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. అయితే లంక టీమ్‌లో వరుసగా కరోనా కేసులు నమోదవడంతో.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మళ్లీ భారత క్రికెటర్లని క్వారంటైన్‌లో ఉండమని శ్రీలంక క్రికెట్ బోర్డు సూచించినట్లు సమాచారం తెలుస్తోంది. ఈరోజు ధావన్ సేన హోటెల్లోనే క్వారంటైన్ అయింది. లంక బోర్డు నుంచి తదుపరి ఆదేశాల వరకూ భారత ఆటగాళ్లు హోటల్ రూములకే పరిమితం కానున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ దృవీకరించాల్సి ఉంది.

17న తొలి వన్డే
కరోనా కేసులు వెలుగుచూడటంతో భారత్, శ్రీలంక మద్య జరుగాల్సిన వన్డే సిరీస్‌ను రీషెడ్యూల్ చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య ఈ నెల 13న తొలి వన్డే జరుగాల్సి ఉండగా.. మొదటి మ్యాచ్‌ను 17కు తరలించారు. సవరించిన తేదీల ప్రకారం రెండో మ్యాచ్ 19న, చివరి మ్యాచ్ 21న జరుగుతుంది. 3 టీ20ల సిరీస్‌ను 24, 25, 27వ తేదీల్లో నిర్వహిస్తారు. రెండు దేశాల బోర్డుల మధ్య చర్చలు జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ అధికారి శుక్రవారం తెలిపారు.


Click it and Unblock the Notifications












