INDvsBAN: ఏం ఆడార్రా.. టీమిండియా బ్యాటర్ల పై ఫ్యాన్స్ ప్రశంసలు

బంగ్లాదేశ్ తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు రాణించారు. బంగ్లా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. దీంతో అభిమానులు టీమిండియా బ్యాటర్లను మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా వెటరన్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ శతకంతో ఆకట్టుకున్నాడు. అతనితోపాటు యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ కూడా సెంచరీ సాధించాడు.

బంగ్లా ఇన్నింగ్స్ చకచకా..
రెండో రోజు చివరకు 133/8 స్కారుతో నిలిచిన బంగ్లాదేశ్ జట్టు.. మూడో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే ఆలౌట్ అయిపోయింది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకోవడంతో బంగ్లా ఆలౌట్ అయిపోయింది. ఆ జట్టుకు ఫాలో ఆన్ అవకాశం ఇవ్వని టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. భారీ స్కోరు చేసి బంగ్లా ముందు అసాధ్యమైన లక్ష్యాన్ని ఉంచడమే టీమిండియా ప్లాన్. అయితే ఇన్నింగ్స్ ప్రారంభించిన కాసేపటికే ఆ ప్లాన్ బోల్తా కొట్టించి.

రాహుల్ మళ్ళీ ఫెయిల్..
టీమిండియా కెప్టెన్ రాహుల్ వరుసగా రెండో ఇన్నింగ్స్ లో కూడా ఫెయిల్ అయ్యాడు. మరోసారి ఖలీద్ అహ్మద్ బౌలింగ్ లోనే 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు వ్యూహం బెడిసికొట్టింది అని అంట అనుకున్నారు. అయితే గిల్ కు జత కలిసిన పుజారా మరోసారి జట్టును ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 90 పరుగుల వద్ద అవుటై సెంచరీ మిస్ చేసుకున్న అతను.. ఈసారి మరింత పట్టుదలగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

సెంచరీ హీరోలు..
రాహుల్ ఫెయిల్ అవ్వడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్న గిల్, పుజారా ఇద్దరూ అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలోనే గిల్ (110l టెస్టు క్రికెట్లో తన తొలి అంత్జాతీయ సెంచరీ నమోదు చేశాడు. జట్టును మెరుగైన స్థితిలో నిలిపేందుకు వేగంగా ఆడిన అతను.. సెంచరీ పూర్తయిన కాసేపటికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (19 నాటౌట్) తో కలిసి పుజారా కూడా గేరు మార్చాడు.

మూడేళ్ల తర్వాత..
అంతర్జతీయ శతకం చేసి మూడేళ్లు పూర్తయిన దాహాన్ని పుజారా ఎట్టకేలకు తీర్చుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో గిల్ నిష్క్రమించిన తర్వాత తను కూడా గేరు మార్చాడు. వేగంగా ఆడుతూ సెంచరీ దిశగా సాగాడు. చివరకు బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని సెంచరీ పూర్తయిన వెంటనే రాహుల్ తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. అప్పటికి ఇండియా స్కోర్ 258/2 పరుగులు. పుజారా 102 పరుగులతో అజేయంగా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications