విరాట్ కోహ్లీ థంప్సప్ సింబల్
కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమించాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సలహాలతో కోహ్లీ ప్రాక్టీసు చేశాడు. కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు ద్రావిడ్ చాలా సహకరించాడు. కోహ్లీతోపాటు వెటరన్ ఆటగాళ్లు ఇషాంత్ శర్మ, రవి చంద్రన్ అశ్విన్‌లు కూడా సుధీర్ఘంగా బౌలింగ్ చేశారు. ఇక చివరగా విరాట్ కోహ్లీ థంప్సప్ సింబల్ చూపెట్టడంతో ఉదయం ప్రాక్టీస్ సెషన్ ముగిసినట్లు బీసీసీఐ పేర్కొంది. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సిద్ధంగా ఉన్నామని, ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేయండని ట్వీట్ చేసింది.
టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా షెడ్యూల్
ఈ నెల 26 నుంచి బాక్సింగ్‌డే సందర్భంగా సెంచూరియన్ వేదకగా భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. జనవరి 3 నుంచి జోహన్నెస్ బర్గ్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్, 11 నుంచి కేప్‌టౌన్ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అలాగే జనవరి 19 నుంచి ఇండియా, సౌతాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి రెండు వన్డేలు పార్లు స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఇక మూడే వన్డే కేప్‌టౌన్ వేదికగా జరగనుంది. జనవరి 19న తొలి వన్డే, జనవరి 21న రెండో వన్డే, జనవరి 23న మూడో వన్డే జరగనుంది.
టెస్ట్ సిరీస్‌పై మాజీ ఆటగాడి జోస్యం
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న టెస్టు సిరీస్‌ను టీమిండియా 2-0 తేదా 2-1తో గెలుచుకుంటుందని టీమిండియా మాజీ ఆటగాడు సబాకరీం జోస్యం చెప్పాడు. జట్టులో ఉన్నా అనుభవజ్ఞులైన ఆటగాళ్లతోపాటు యువ ఆటగాళ్లు కూడా ప్రస్తుతం రాణిస్తున్నారని ఆయన అన్నారు. వన్డేల్లోనూ భారత్ బలంగా ఉందన్నారు. ఇటీవల సౌతాఫ్రికా జట్టు పెదగా రాణించడం లేదని, అందుకే సౌతాఫ్రికాలో తొలి టెస్ట్ సిరీస్ గెలిచిందేకు భారత్‌కు ఇదే సువర్ణవకాశం అని సబాకరీం చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












