హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ కోసం నగరానికి చేరుకున్న టీమిండియా బుధవారం కూడా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సందడి చేశారు. వార్మప్ సెషన్‌కు ముందు జట్టులోని ఆటగాళ్లు స్టేడియంలో ఓర్టెక్స్ బంతిని ఒకరి నుంచి మరొకరికి మార్చుకుంటూ బంతి కోసం పోటీపడ్డారు.

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య గురువారం నుంచి ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు బుధవారం కూడా స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు. తొలుత స్టేడియానికి చేరుకున్న కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టేడియంలోని పిచ్‌ను పరిశీలించారు.

అనంతరం ఆటగాళ్లు నెట్‌లో బౌలింగ్, బ్యాటింగ్ చేస్తూ ఎక్కువ సమయాన్ని గడిపారు. కోచ్ శ్రీధర్ కొట్టిన బంతులను వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా క్యాచ్‌లు పడుతూ ఎక్కువ సమయాన్ని గడిపారు. దీనికి సంబంధించిన వీడియోలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.