పుష్ప మానియాలో టీమిండియా.. సినిమా చూసిన ఆటగాళ్లు!

ప్రస్తుతం భారత జట్టు సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ ఆడుతోంది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో బోణి కొట్టింది. అనంతరం రెండో టెస్టుకు ముందు టీమిండియా కాస్త ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన స్ట్రైలీష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం పుష్పను టీమిండియా ఆటగాళ్లంతా వీక్షించారు. ఈ విషయాన్ని తెలుగు ఆటగాడు హనుమ విహారి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. సినిమా చూస్తున్నంత సేపు తామంత పుష్ప ట్రాన్స్‌లోనే ఉన్నామని ట్వీట్‌లో చెప్పాడు. విలక్షణ నటుడు అల్లు అర్జున్, పుష్ప చిత్ర బృందానికి ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు అభినందనలు తెలిపారు. అంతేకాకుండా పుష్ప-2 కోసం ఎదురుచూస్తున్నట్లు హనుమ విహారి పేర్కొన్నాడు.

అంతటా పుష్ప మానియా
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పుష్ప మానియా నడుస్తోంది. దేశంలోని పలు భాషల్లో డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం అభిమానులను అలరిస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణం వహించింది. అల్లు అర్జున్, రష్మిక మంధాన హిరో, హిరోయిన్లుగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చారు. చంద్రబోస్ సాహిత్యం అందించారు. సమంత ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి పార్ట్ మాత్రమే ఇప్పుడు విడుదలైంది. రెండో పార్ట్ తర్వాత విడుదల చేయనున్నారు.
పుష్ప డైలాగ్‌తో ఆకట్టుకున్న జడేజా, వార్నర్
పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అనేక మంది ఈ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతోపాటు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పుష్ప డైలాగ్‌తో ఆకట్టుకున్నారు. ఇద్దరు కూడా డైలాగ్ ప్లే అవుతుంటే దానికి తగ్గట్టుగా లిప్స్ కదిలిస్తూ, అచ్చం అల్లు అర్జున్ హవాభావాలతో ఆకట్టుకున్నారు. ఈ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అభిమానులు ప్రశంసలు కురిపించారు.

మూడో టెస్టు కోసం కసరత్తులు
తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించిన టీమిండియా జోహన్నెస్ బర్గ్ వేదికగా ఈ నెల 3 నుంచి జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధమవుతుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన ఊపులో రెండో మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం టీమిండియా తగిన కసరత్తులు చేస్తోంది. కాగా టీమిండియా ఆటగాళ్లంతా గత రాత్రి న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications