Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final : ఐసీసీ ట్రోఫీ కోసం చెమటోడుస్తున్న టీమిండియా.. ఫైనల్‌కు ముందు ఇంటెన్స్ ప్రాక్టీస్!

డబ్ల్యూటీసీ కోసం టీమిండియా చాలా గట్టిగా రెడీ అవుతోంది. టీమిండియాలో చాలా మంది ఆటగాళ్లు కొన్ని రోజుల క్రితం వరకు ఐపీఎల్‌లో ఆడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టెస్టు ఫార్మాట్‌కు అలవాటు పడేందుకు టీమిండియా ప్లేయర్లు కష్టపడుతున్నారు. అయితే టెస్టుల్లో ఫీల్డింగ్ కూడా చాలా ముఖ్యం అన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే భారత బృందం ఫీల్డింగ్‌లో కూడా చాలా కష్టపడుతోంది. తాజాగా స్టార్ ప్లేయర్లు అందరూ ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లో చెమటోడ్చారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ఇన్‌స్టా ఖాతాలో పంచుకుంది. దీనిలో ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కీలకమైన సూచనలు చేస్తూ కనిపించాడు. అలాగే జట్టును రెండు గ్రూపులుగా విడగొట్టినట్లు తెలుస్తోంది.

WTC Final

ఒక గ్రూప్ ప్లేయర్లు లో క్యాచులపై బాగా ఫోకస్ పెట్టారు. రెండో గ్రూప్ మాత్రం హై క్యాచులు బాగా ప్రాక్టీస్ చేసింది. ఫీల్డింగ్‌లో కూడా రాణిస్తేనే ఆస్ట్రేలియాను ఓడించగలమని భారత జట్టుకు కూడా స్పష్టంగా తెలుసు. ఈ క్రమంలోనే అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించి, చాలా కాలం తర్వాత భారత్‌కు ఒక ఐసీసీ ట్రోఫీ అందించాలని ప్లేయర్లు అంతా కష్టపడుతున్నారు.

ఈ వీడియోను షేర్ చేసిన బీసీసీఐ.. 'హై ఎనర్జీ లెవెల్స్. డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు ప్రతి సెషన్‌తో ఇంటెన్సిటీ పెంచుతున్న టీమిండియా' అనే క్యాప్షన్ తగిలించింది. ఈ వీడియోలో ఫీల్డింగ్ కోచ్ చెప్పే మాటలను కోహ్లీ సహా అందరూ జాగ్రత్తగా విన్నారు. అలాగే గిల్, అశ్విన్, కోహ్లీ తదితరులు లో-క్యాచులు బాగా ప్రాక్టీస్ చేశారు.

మిగతా వారిలో కొందరు హై క్యాచులు ప్రాక్టీస్ చేశారు. ఓవల్ స్టేడియం వేదికగా మరికొన్ని రోజుల్లోనే ఆస్ట్రేలియా, భారత్ జట్టు డబ్ల్యూటీసీ ట్రోఫీ కోసం తలపడనున్న సంగతి తెలిసిందే. ఇక్కడ పేస్‌తోపాటు స్పిన్నర్లకు కూడా పిచ్ సహకరిస్తుందని సమాచారం. అదే జరిగితే భారత ఆటగాళ్ల స్లిప్ ఫీల్డింగ్‌ కూడా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.

Story first published: Saturday, June 3, 2023, 10:49 [IST]
Other articles published on Jun 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+