Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: టెస్టు ర్యాంకులు మెరుగు పరుచుకున్న అశ్విన్, శ్రేయాస్..!

Team India players gain in ICC test rankings after INDvsBAN series

బంగ్లాదేశ్‌తో తాజాగా ముగిసిన టెస్టు సిరీస్‌లో రాణించిన భారత ఆటగాళ్లు టెస్టు ర్యాంకింగ్స్ మెరుగయ్యాయి. ముఖ్యంగా రెండో టెస్టులో జట్టును దగ్గరుండి గెలిపించిన రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ తమ ర్యాంకులు మెరుగు పరుచుకున్నారు. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్సులో నాలుగు వికెట్లతో రాణించిన అశ్విన్.. రెండో ఇన్నింగ్సులో కూడా రెండు వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచు చివరి ఇన్నింగ్సులో కఠిన పిచ్‌పై 42 పరుగులతో అజేయంగా నిలిచిన అశ్విన్.. జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

ఈ కీలకమైన ప్రదర్శనలకు గానూ అశ్విన్ టెస్టు ర్యాంకింగ్ మెరుగైంది. బౌలర్ల జాబితాలో ఒక స్థానం మెరుగు పరుచుకున్నాడు. టాప్ టెస్టు బౌలర్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ స్థానాన్ని అశ్విన్, బుమ్రా పంచుకుంటున్నారు. అలాగే బ్యాటింగ్‌లో కూడా రాణించిన అశ్విన్.. టెస్టు బ్యాటర్ల జాబితాలో మూడు స్థానాలు మెరుగై 82వ స్థానానికి చేరాడు. ఇక ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో కొంత కాలం క్రితం వరకు టాప్ ప్లేస్‌లో ఉన్న అశ్విన్.. ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్‌పై రాణించడంతో అతని రేటింగ్ పాయింట్లు పెరిగాయి. అయితే తొలి స్థానంలో మాత్రం రవీంద్ర జడేజానే కొనసాగుతున్నాడు.

యువ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కూడా బంగ్లా పర్యటనలో అద్భుతంగా రాణించాడు. తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్సులో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్సులో 86 పరుగులు చేసిన అయ్యర్.. రెండో ఇన్నింగ్స్‌లో 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగతా బ్యాటర్లు క్రీజులో కుదురుకోవడానికి కష్టాలు పడుతుంటే.. అతను మాత్రం అశ్విన్‌తో కలిసి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వీళ్లిద్దరూ కలిసే భారత్‌కు రెండో టెస్టులో విజయాన్ని కట్టబెట్టారు. దీంతో అయ్యర్ తన కెరీర్ బెస్ట్ 16వ ర్యాంకు సాధించాడు. ఇంతకుముందు 26వ ర్యాంకులో ఉన్న అతను.. ఏకంగా పది స్థానాలు మెరుగయ్యాడు.

Story first published: Wednesday, December 28, 2022, 15:51 [IST]
Other articles published on Dec 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+