Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Yearend 2019: కలిసొచ్చిన రెండో అర్ధభాగం, ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా!

 Team india overall performance in T20s, 2019

హైదరాబాద్: వెస్టిండిస్‌తో మూడు టీ20ల సిరిస్ ముగియడంతో 2019లో టీమిండియా టీ20 పోరాటం ముగిసింది. 2019లో న్యూజిలాండ్‌ గడ్డపై సిరీస్‌ చేజార్చుకోవడంతో ఏడాదిని మొదలెట్టిన కోహ్లీసేన వెస్టిండీస్‌పై 2-1 తేడాతో సిరిస్‌ను కైవసం చేసుకుని ఘనంగా ముగించింది.

ఈ ఏడాది మొత్తంగా 17 టీ20లు ఆడిన టీమిండియా 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. ఇక, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ఈ ఏడాది తొలి అర్ధభాగం టీమిండియాకు కలిసి రాలేదు.

కలిసొచ్చిన రెండో అర్ధభాగం

కలిసొచ్చిన రెండో అర్ధభాగం

ఇక, రెండో అర్ధభాగంలో టీమిండియా ఫరవాలేదనిపించింది. ఈ ఏడాది మొదట్లో రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా న్యూజిలాండ్‌లో మూడు టీ20లు ఆడిన టీమిండియా 1-2తో సిరీస్‌ కోల్పోయింది. ఆ వెంటనే భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టీ20ల సిరిస్‌లో 0-2తో ఓటమిపాలైంది.

ఐపీఎల్, వరల్డ్‌కప్ రావడంతో

ఐపీఎల్, వరల్డ్‌కప్ రావడంతో

ఆ తర్వాత ఐపీఎల్, వరల్డ్‌కప్ సందర్భంగా ఆర్నెళ్ల పాటు టీమిండియా టీ20లు ఆడలేదు. ఇంగ్లాండ్‌‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ అనంతరం విండీస్‌ పర్యటనకు వెళ్లిన టీమిండియా అక్కడ మూడు టీ20ల సిరిస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇందులో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లు అమెరికాలో జరగ్గా, మూడో మ్యాచ్‌ కరీబియన్‌ దీవుల్లో నిర్వహించారు.

3-0తో టీమిండియా క్లీన్ స్వీప్

3-0తో టీమిండియా క్లీన్ స్వీప్

ఈ మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌‌ను సమం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రైద్దెంది. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌లను ఇరు జట్లు చెరొకటి గెలవడంతో సిరీస్‌ 1-1తో సమమైంది.

బంగ్లాదేశ్, విండిస్‌లపై ఘన విజయం

బంగ్లాదేశ్, విండిస్‌లపై ఘన విజయం

అనంతరం బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌లపై విజయాలను నమోదు చేసింది. బంగ్లాదేశ్‌తో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌‌లో ఓడిన టీమిండియా ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 2-1తో సిరిస్‌ను కైవసం చేసుకుంది. ఇక, వెస్టిండిస్‌తో జరిగిన మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో సొంతం చేసుకుని ఈ ఏడాదిని ఘనంగా ముగించింది.

జనవరిలో శ్రీలంకతో రెండు టీ20ల సిరిస్

జనవరిలో శ్రీలంకతో రెండు టీ20ల సిరిస్

అయితే, బంగ్లాదేశ్, వెస్టిండిస్ పర్యటనల్లో భాగంగా టీమిండియా ఓడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడే పరాజయం ఎదురైంది. ఫలితంగా టీమిండియా ఆడిన చివరి చివరి 12 టీ20ల్లో ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధించడం విశేషం. టీమిండియా తన తదుపరి టీ20 సిరీస్‌లో శ్రీలంకతో తలపడనుంది. జనవరిలో శ్రీలంకతో రెండు టీ20ల సిరిస్ ఆడనుంది.

Story first published: Friday, December 13, 2019, 13:25 [IST]
Other articles published on Dec 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+