Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు భజ్జీ సేవలు అవసరం: 'ద వాల్' ద్రవిడ్

Rahul Dravid
ఇండియన్ క్రికెట్ టీమ్ 'దివాల్' గా పిలుచుకునే రాహుల్ ద్రవిడ్ సౌమ్యుడని అందరికి తెలిసిందే. ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ద్రవిడ్ ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరిస్‌లో ఫేసర్స్ లేకుండా బరిలోకి దిగడం దీనిపై మీ అభిప్రాయం అని ప్రశ్నించగా, అవును నిజమే ప్రస్తుతం టీమ్ ఇండియా ఫేసర్స్ అయిన జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, ప్రవీణ్ కుమార్ లేకుండా బరిలో దిగడం ఆలోచించ తగ్గ విషమయే. టీమ్ ఇండియాకు ఎప్పుటి నుండో ఫేసర్స్ కొరత ఉన్న మాట వాస్తవమేనని అన్నారు.

ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే ఒంటి చేత్తో మ్యాచ్‌ని గెలిపించగలిగే కుంబ్లే స్దానం భర్తీ చేయడం కష్టమేనని అన్నారు. ఐతే ప్రస్తుతం ఉన్న అమిత్ మిశ్రా, ప్రజ్ఞాన్ ఓజా, హార్బజన్ సింగ్ సామర్ద్యం ఉన్న యువకులుగా కనిపిస్తున్నారు. ఇక హార్బజన్ విషయానికి వస్తే వన్డే‌లలో 400 వికెట్లు తీసుకొవడం జరిగిందన్నారు. వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లలో గనుక చూసినట్లేతే అతని యొక్క సామర్ద్యం ఏపాటిదో ఇట్టే తెలిసిపోతుంది.

టీమ్ ఇండియాకు హార్బజన్ సింగ్ సేవలు ఇంకా అవసరం. ఎందుకంటే భజ్జీ లేకుండా టీమ్ ఇండియా చాలా పూర్‌గా కనిపిస్తుందన్నారు. భజ్జీ గనుక ఖచ్చితమైన బౌలింగ్ వేశాడంటే ఆటలో గట్టి పోటీ ఉంటుందని తన మనసులోని మాటలను వెల్లడించారు. భజ్జీ గురించి టీమిండియా డాషింగ్ ఓపెనర్ కూడా మాట్లాడడం జరిగింది. 'అతడు (హర్భజన్‌) ఛాంపియన్‌ బౌలర్‌. భజ్జీ తిరిగి జట్టులోకొస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

అతడు ప్రస్తుతం నాగ్‌పూర్‌లో జరుగుతున్న ఛాలెంజర్‌ సిరీస్‌లో ఆడుతున్నాడు. స్వదేశీ క్రికెట్‌లో తీవ్రంగా కష్టపడుతున్నాడు' అని సెహ్వాగ్‌ అన్నాడు. తాను కూడా 2007లో టీమ్‌ ఇండియాలో చోటు కోల్పోవడంతో స్వదేశీ క్రికెట్‌లో తీవ్రంగా శ్రమించి తిరిగి జట్టులోకి పునరాగమం చేశాడని పాత జ్ఞాపకాలను గుర్తు చేశాడు. భజ్జీపై అందరూ ఇలా స్పందించడానకి కారణం స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే మ్యాచ్‌లలో సెలక్టర్స్ భజ్జీని జట్టులోకి తీసుకోని విషయం తెలిసిందే.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+