INDvsAUS : అనుకున్నదే అయింది.. గిల్‌కు ఛాన్సివ్వని టీమిండియా!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీసులో భారత జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో జట్టులో కేవలం ఒకే ఒక మార్పు చేసినట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు. టీమిండియా మిడిలార్డర్‌లో అరంగేట్రంలో విఫలమైన సూర్యకుమార్ యాదవ్‌ను పక్కన పెట్టాలని టీం మేనేజ్‌మెంట్ నిర్ణయించుకుంది. అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను తీసుకున్నట్లు రోహిత్ వెల్లడించాడు.
టీమిండియాలో ఒకే మార్పు..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆసీస్ సారధి ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచాడు. పిచ్‌ను చూసిన తర్వాత ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తాము కూడా బ్యాటింగ్ చేయాలని అనుకున్నామని రోహిత్ చెప్పాడు. అయితే ఏం చేసినా నూటికి నూరు శాతం కష్టపడతామన్నాడు. తమ జట్టులో ఒకే ఒక మార్పు చేశామని, సూర్య స్థానంలో అయ్యర్ ఆడుతున్నాడని తేల్చేశాడు. ఇక ఎలాంటి మార్పులు లేవన్నాడు. దీంతో గిల్ ఈ మ్యాచ్‌లో కూడా బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి వచ్చింది.
ఆసీస్‌లో కీలక మార్పులు..
ఆస్ట్రేలియా సారధి ప్యాట్ కమిన్స్ మాత్రం తమ జట్టులో రెండు కీలక మార్పులు చేసినట్లు వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు ఒకే ఒక్క పేసర్‌తో బరిలో దిగుతోంది. అలాగే రెన్‌షా స్థానంలో ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌ను తీసుకున్నట్లు చెప్పాడు. అలాగే స్కాట్ బోలాండ్‌ను పక్కన పెట్టి యువ స్పిన్నర్ కునెమన్‌ను ఆడిస్తున్నట్లు తెలిపాడు. తొలి టెస్టులో అరంగేట్రం చేసిన టాడ్ మర్ఫీలాగే.. కునెమన్ కూడా అరంగేట్రంలో అదరగొట్టాలని ఆసీస్ జట్టు భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు కేవలం ఒక్క పేసర్, ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగుతుండటం గమనార్హం.
పుజారా వందో టెస్టు..
ఈ మ్యాచ్‌లో తన వందో టెస్టు ఆడుతున్న పుజారాపై అందరి చూపూ ఉంది. ఈ మ్యాచ్‌లో అతను అద్భుతంగా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ అతన్ని అభినందించాడు. ఈ మ్యాచ్‌లో పుజారా సెంచరీ సాధించి, వందో టెస్టులో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డు సాధించాలని గవాస్కర్ కోరుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గవాస్కర్ చేతుల మీదుగా జ్ఞాపిక అందుకుంటూ ఈ మాటలు విన్నందుకు పుజారా సంతోషం వ్యక్తం చేశాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా టీం: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, పీటర్ హాండ్స్‌కోంబ్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), టాడ్ మర్ఫీ, నాథన్ లియాన్, మాథ్యూ కునెమన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications