INDvsBAN: పసికూన చేతిలో పరాభవం.. తొలి వన్డేలో టీమిండియా ఓటమి..!

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఓటమి చవి చూసింది. షేర్-ఈ-బంగ్లా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. కేఎల్ రాహుల్ (74) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించకపోవడంతో టీమిండియా మంచి స్కోరు చెయ్యలేకపోయింది.
చివర్లో టెయిలెండర్ల సాయంతో భారత్‌ను 200 మార్కు దాటించేందుకు రాహుల్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో టీమిండియా కేవలం 186 పరుగులకే ఆలౌట్ అయింది.

ఛేజింగ్‌లో బంగ్లా తడబాటు..
లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ తొలి బంతికే దీపక్ చాహర్ బౌలింగ్‌లో షాంటో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపు వికెట్లు పడకుండా జాగ్రత్త పడినప్పటికీ.. సిరాజ్ బౌలింగ్‌లో పదో ఓవర్ తొలి బంతికి అనాముల్ హక్ (14) కూడా అవుటయ్యాడు. దీంతో కెప్టెన్ లిటన్ దాస్ (41)కి జతకలిసిన షకీబల్ హసన్ (29) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ జోడీని వాషింగ్టన్ సుందర్ విడగొట్టాడు. ముందుగా లిటన్ దాస్‌ను, ఆ తర్వాత షకీబల్ హసన్‌ను పెవిలియన్ చేర్చాడు.

పేసర్ల దూకుడు..
ముష్ఫికర్ రహీమ్ (18), మహ్మదుల్లా (14) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ వరుస ఓవర్లలో వీళ్లిద్దరినీ అవుట్ చేశారు. ఆ తర్వాత అరంగేట్ర పేసర్ కుల్దీప్ సేన్ కూడా సత్తా చాటాడు. ఆఫిఫ్ హుస్సేన్ (6), ఎబాదత్ హుస్సేన్ (0) వికెట్లు తీసుకున్నాడు. ఆ వెంటనే హసన్ మహమూద్ (0)ను సిరాజ్ అవుట్ చేశాడు. దీంతో భారత జట్టు విజయం సాధించేలా కనిపించింది. ఎందుకంటే అప్పటికి బంగ్లా స్కోరు 136/9 మాత్రమే.
ఫలితం మార్చిన చివరి వికెట్..
ఇక చివరగా క్రీజులో ఉన్న మెహదీ హసన్ (38 నాటౌట్), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (10 నాటౌట్) ఇద్దరూ బౌలర్లే కావడంతో విజయం భారత్‌దే అని అంతా అనుకున్నారు. అయితే టెయిలెండర్ల వికెట్లు తీయడంలో తన అశక్తతను టీమిండియా మరోసారి నిరూపించుకుంది. చేయాల్సిన పరుగులు తక్కువ కావడంతో వీళ్లిద్దరినీ సాధ్యమైనంత త్వరగా అవుట్ చేయాల్సి ఉంది. కానీ భారత బౌలర్లు ఈ పని చేయడంలో ఫెయిలయ్యారు. దీంతో 46 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం కూడా పొందింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications