For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ: తడబడిన టీమిండియా బ్యాటింగ్.. ఏడు వికెట్లు డౌన్

 Team India lost seven wickets as their batting line up struggles

కివీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాటింగ్ లైనప్ తడబడింది. శ్రేయస్ అయ్యర్ (49) తప్ప మిగతా ఏ బ్యాటరూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో సంజూ శాంసన్ స్థానంలో తీసుకున్న దీపక్ హుడా (12)తోపాటు దీపక్ చాహర్ (12) కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో భారత జట్టు 170 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (28), శుభ్‌మన్ గిల్ (13) ఇద్దరూ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (10), సూర్యకుమార్ యాదవ్ (5) ఇద్దరూ మరోసారి విఫలమయ్యారు. సూర్యకుమార్ యాదవ్‌ను ఆడమ్ మిల్నే పెవిలియన్ చేర్చాడు. అంతకుముందే బ్యాటింగ‌కు వచ్చిన రిషభ్ పంత్ (10) .. డారియల్ మిచెల్ బౌలింగ్‌లో మైదానం వీడాడు.

 Team India lost seven wickets as their batting line up struggles

ఇలాంటి సమయంలో శ్రేయాస్ అయ్యర్ (49) మరోసారి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. లోకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా కూడా ఆకట్టుకోలేదు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో తక్కువ స్కోరు వద్దనే అవుటయ్యాడు. దీపక్ చాహర్ కూడా డారియల్ మిచెల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతానికి వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్ క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్‌ను 2- తేడాతో కివీస్ చేజిక్కించుకుంటుంది.

టాస్ గెలిచిన సమయంలో పిచ్‌లో అనుకున్నంత దాని కన్నా ఎక్కువ బౌన్స్ కనపడుతోందని, అందుకే తాము ముందుగా బౌలింగ్ చేస్తామని కేన్ విలియమ్సన్ చెప్పాడు. ఈ నిర్ణయమే అతనికి బాగా కలిసొచ్చింది. అదే సమయంలో భారత జట్టులో ఎలాంటి మార్పులూ లేవని, రెండో మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలో దిగుతున్నామని శిఖర్ ధవన్ చెప్పాడు. అంటే దీపక్ హుడాను తీసుకొని సంజూ శాంసన్‌కు మరోసారి మొండిచెయ్యి చూపించారన్నమాట.

Story first published: Wednesday, November 30, 2022, 10:35 [IST]
Other articles published on Nov 30, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+