For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ: హాఫ్ సెంచరీలతో మెరిసి.. ఆ వెంటనే గిల్, ధవన్ ఇద్దరూ అవుట్!

 Team India lost both their openers after a century opening stand

న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు ఓపెనర్లు ఇద్దరి వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టుకు శుభ్‌మన్ గిల్ (50), శిఖర్ ధవన్ (77) శుభారంభం అందించారు. అయితే వీళ్లిద్దరూ చాలా నెమ్మదిగా ఆడటంతో జట్టు స్కోరు బోర్డు కూడా నిదానంగానే ముందుకు సాగింది. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీంతో 23 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్లేమీ నష్టపోకుండా 124 పరుగులతో నిలిచింది.

ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే గిల్ అవుటయ్యాడు. లోకీ ఫెర్గూసన్ వేసిన బంతికి టైమింగ్ మిస్సయిన గిల్.. డీప్ స్క్వేర్ లెగ్ సమీపంలోకి షాట్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న డెవాన్ కాన్వే ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ పట్టేయడంతో గిల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇది జరిగిన కాసేపటికే ధవన్ కూడా అవుటయ్యాడు.

టిమ్ సౌథీ వేసిన 25వ ఓవర్ మూడో బంతికి బౌండరీ బాదేందుకు ధవన్ ప్రయత్నించాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని డ్రైవ్ చేసేందుకు ట్రై చేశాడు. అయితే బంతి బ్యాక్ వర్డ్ పాయింట్‌లో ఉన్న ఫిన్ అలెన్‌ వైపు వెళ్లింది. దాన్ని అతను క్యాచ్ పట్టేయడంతో ధవన్ కూడా పెవిలియన్ చేరాడు. సెంచరీ భాగస్వామ్యం తర్వాత ఓపెనర్లిద్దరూ మైదానం వీడారు.

ఓపెనర్లు అవుటవడంతో ప్రస్తుతం క్రీజులో శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ ఉన్నారు. వీళ్లిద్దరూ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో 27 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 140 పరుగుల స్కోరుతో నిలిచింది. ఈ స్టేడియంలో బౌండరీలు చిన్నవి కావడంతో భారీ స్కోర్లు నమోదవుతాయిన అందరూ అనుకున్నారు. భారత ఇన్నింగ్స్ ఇదే మాదిరి సాగితే భారీ స్కోరు సాధించడం కష్టంగా కనిపిస్తోంది. చివరి పది ఓవర్లలో టీమిండియా బ్యాటర్లు గేరు మారుస్తారేమో చూడాలి.

టీమిండియా: శిఖర్ ధవన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్

న్యూజిల్యాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, డారియల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, ఆడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లోకీ ఫెర్గూసన్

Story first published: Friday, November 25, 2022, 9:13 [IST]
Other articles published on Nov 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+