
ఒక జట్టుపై భారత్‌కు అత్యధిక వరుస ఓటములు ఎప్పుడెప్పుడంటే..?
1998-2000లో ఆస్ట్రేలియాపై టీమిండియా వరుసగా 10ఓటములు నమోదు చేసింది. 1974 - 77 మధ్య ఇంగ్లాండ్ చేతిలో వరుసగా 9 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇక 1995-96లో దక్షిణాఫ్రికా చేతిలో వరుసగా 7మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇప్పుడు మళ్లీ 2021- 22లో టీమిండియా దక్షిణాఫ్రికా చేతిలో 7వరుస ఓటములు చవిచూసింది. ఇక పరాజయాల పరంపరకు టీమిండియా విశాఖపట్టణంలో తెరదించాల్సిన అవసరముంది. లేకపోతే దక్షిణాఫ్రికా చేతిలో అత్యధిక సార్లు (8)సార్లు వరుస ఓటములతో అవమానకరమైన రికార్డు టీమిండియా పేరిట నమోదు అవుతుంది.

తాజాగా దక్షిణాఫ్రికాతో వరుసగా 7 ఓటములు ఇవే
IND vs SA 2వ టెస్ట్, జోహన్నెస్‌బర్గ్: భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది
IND vs SA 3వ టెస్ట్, కేప్ టౌన్: భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది
IND vs SA 1వ వన్డే, పార్ల్: భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది
IND vs SA 2వ వన్డే, పార్ల్: భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది
IND vs SA 3 వ వన్డే, కేప్ టౌన్: భారత్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది
IND vs SA 1st T20, ఢిల్లీ: భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది
IND vs SA 2nd T20, కటక్: భారత్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది

రోహిత్ శర్మ గైర్హాజరీలో రాణించలేకపోతున్న టీమిండియా
సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ చివరిసారిగా ప్రోటీస్ జట్టుపై గెలిచింది. ఆ తర్వాత భారత్ వరుసగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, రెండు టీ20లతో కలిపి ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక ఆస్ట్రేలియా చేతిలో వరుసగా 10 మ్యాచ్‌లు గతంలో టీమిండియా ఓడిపోయింది. 1999-2000 టైంలో మహ్మద్ అజరుద్దీన్, అజయ్ జడేజా, సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలతో కూడిన భారత జట్టుపై ఆస్ట్రేలియా ఏకచ్ఛత్రాధిపత్యం వహించింది. ఇక ఐసీసీ నాక్‌అవుట్ టోర్నమెంట్‌లో నైరోబీలో సౌరవ్ గంగూలీ నాయకత్వంలో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడంతో.. వరుస ఓటములకు తెరపడింది. తాజాగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సారథ్యంలో భారత్ దక్షిణాఫ్రికాతో వరుసగా 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక విషయమేంటంటే ఈ మూడు సిరీస్లకు ప్రస్తుత భారత పూర్తిస్థాయి కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించకపోవడం విశేషం. రోహిత్ శర్మ కెప్టెన్‌గా లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ఇక దక్షిణాఫ్రికా వన్డే, టీ20 సిరీస్‌కు రోహిత్ అందుబాటులో లేని సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications
