Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్షిణాఫ్రికాపై నాలుగో వన్డే, సిరీస్ విజయంపై కన్నేసిన భారత్

India
పోర్ట్ ఎలిజబెత్: దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయానికి భారత్ కన్నేసింది. శుక్రవారం పోర్ట్ ఎలిజబెత్‌లో నేడు జరిగే వన్డే మ్యాచులో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకునే ఆలోచనలో టీమిండియా ఉంది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో ఒక్క వన్డే సిరీస్ కూడా గెలవని భారత్ ఆ ఘనత సాధించేందుకు తహతహలాడుతోంది. మలి రెండు వన్డేలను కోల్పోయిన ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు సిరీస్ సమం చేయడానికి ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి సెయింట్ జార్జెస్ పార్క్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. హోరాహోరీగా సాగుతున్న తాజా సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో భారత్ నిలిచింది.

విజయ్ స్థానంలో పార్థివ్ పటేల్ నేటి వన్డేలో బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడి పిచ్ స్పిన్ అనుకూలిస్తుందన్న నేపథ్యంలో భజ్జీకి జోడీగా లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లాను ఆడించాలని భారత్ తలపోస్తోంది. అదే నిజమైతే భారీగా పరులిచ్చుకుంటున్న నెహ్రాపై వేటు తప్పదు. ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన చావ్లాను ప్రతిష్టాత్మక టోర్నీ ముందు ఓసారి పరీక్షించాలని వ్యూహకర్తలు భావిస్తున్నారు. కెప్టెన్ ధోనీ గాయపడినప్పటికీ ఈ మ్యాచులో ఆడే అవకాశాలున్నాయి. ఇటీవల ఫామ్‌లోలేని డుమినీ పరుగుల వేటలో క్లిక్ కావడం, కొత్త ఆటగాడు డు ప్లెసిస్ సెలెక్టర్ల నమ్మకానికి న్యాయం చేయడం స్మిత్ సేనకు ప్రపంచకప్ ముందు లభించిన సానుకూలాంశాలు. వరుసగా విఫలమవుతున్న వేన్ పార్నెల్ స్థానంలో లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధమైనట్టే.

సాధారణంగా సెయింట్ జార్జెస్ పార్క్ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందని నమ్మకం. అయితే భారీస్కోర్లూ సాధ్యమేనని కొన్నిసార్లు రుజువైంది కూడా. ఈ మైదానంలో పరుగుల సగటు 250. ఇక్కడ అత్యధిక స్కోరు పాకిస్తాన్ (335/6)దే. అయితే భారత్ ఇక్కడ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. ఇక వాతావరణం విషయానికొస్తే, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, జల్లులు కురిసే అవకాశముంది. అత్యధిక ఉష్ణోగ్రత 25, అత్యల్ప ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశాలున్నాయి.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+