For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టీ20పై కాలుష్యం ఎఫెక్ట్: భారత ఆటగాళ్ల ఔట్ డోర్ ట్రైనింగ్ సెషన్ రద్దు!

Team India likely to train indoors for 1st T20I vs Bangladesh due to poor air quality in Delhi

హైదరాబాద్: ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యూఐ) దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కువ మెరుగుదల సంకేతాలను చూపించకపోవడంతో భారత ఆటగాళ్ళు అరుణ్ జైట్లీ స్టేడియంలో ఔట్ డోర్ ట్రైనింగ్ సెషన్లను మిస్సయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 3 టీ20లు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం బంగ్లాదేశ్‌ బుధవారం భారత పర్యటనకు రానుంది.

తొలి టీ20 నవంబర్ 3న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా అక్టోబర్ 31(గురువారం) ఢిల్లీకి చేరుకోనుంది. అనంతరం భారత ఆటగాళ్లు రెండు ట్రైనింగ్ సెషన్లలో పాల్గొనున్నారు. ఈ రెండు ట్రైనింగ్ సెషన్లను నవంబర్ 1, 2 తేదీల్లో నిర్వహించేందుకు జట్టు మేనేజ్‌మెంట్ ప్రణాళికను సిద్ధం చేసింది.

ఢిల్లీలో వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు తేదీల్లో సాయంత్రం 2 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే భారత ఆటగాళ్లు ట్రైనింగ్ సెషన్లలో పాల్గొనేలా ప్లాన్ చేశారు. అంతేకాదు ఈ ట్రైనింగ్ సెషన్లు ఆప్షనల్ సెషన్లుగా మారే ఆవకాశం కూడా ఉందని అంటున్నారు. దీని అర్ధం ఈ సెషన్లలో ఆటగాళ్లు తప్పనిసరిగా పాల్లొనాలనే నిబంధం ఏమీ ఉండదన్నమాట.

ఇదే గనుక జరిగితే ఆటగాళ్లు ట్రైనింగ్ సెషన్లకు హాజరు కాకుండా జిమ్‌లో గడపొచ్చు. అయితే, శుక్రవారం మరియు శనివారం వాతావరణాన్ని పరిశీలించిన తరువాత దీనిపై తుది నిర్ణయం తీసుకోబడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ "మ్యాచ్ పెద్ద సమస్య కాదు... ఎందుకంటే రాత్రిపూట మ్యాచ్ కాబట్టి" అని అన్నారు.

"సమస్య కేవలం ట్రైనింగ్ మాత్రమే. వాతావరణం మెరుగుపడకపోతే రెండు రోజులను ఆప్షనల్ సెషన్లుగా చూడొచ్చు. ఇదేమీ తాజా సీజన్ కాదు కదా. ఆటగాళ్ళు ఇప్పటికే ఆడుతున్నారు కాబట్టి దీపావళి విరామం తర్వాత వాటిని అమలు చేయడానికి. ప్రస్తుతానికి జిమ్ సెషన్లు సరిపోతాయి. సీనియర్ ఆటగాళ్లు శనివారం వస్తున్నారు" అని ఆయన అన్నారు.

"ఇది కేవలం ఆట పరిస్థితులను అంచనా వేయడానికి ఉపయోగపడుతంది. ఏది ఏమైనప్పటికీ వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మేము వాతావరణ సూచనను తనిఖీ చేస్తున్నాము. మంగళవారం సూర్యుడు ఉదయించలేదు. శుక్రవారం ఎండను చూపుతోంది, కాబట్టి ఆ సందర్భంలో ట్రైనింగ్ సమస్య కాదు" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

సూర్యుడు బయటకు వచ్చిన తర్వాత విషయాలన్నీ మాకు ఆశాజనకంగా ఉంటాయని అన్నారు. మరోవైపు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సీనియర్ అఫీసియల్ ఒకరు మాట్లాడుతూ ఉదయం గాలి ఒక సమస్యగా ఉంది కాబట్టి శనివారం ట్రైనింగ్ సెషన్ల సమయాలు మారే అవకాశం ఉందని అన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మామూలుగానే ఎక్కువగా ఉంటుంది. శీతకాలం సమీపించడం, దీపావళి టపాసులతో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. మూడు రోజుల క్రితం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 357గా నమోదైంది. 400 దాటితే తీవ్ర శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

దీపావళి పండుగ నేపథ్యంలో గాలి నాణ్యత మరింత దిగజారింది. పండగ జరిగిన వారం రోజుల తర్వాత మ్యాచ్‌ ఉండడంతో.. సమస్య తీవ్రత తగ్గుతుందని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే తొలి టీ20 జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. నవంబర్ 3న భారత్‌, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది.

Story first published: Tuesday, October 29, 2019, 17:57 [IST]
Other articles published on Oct 29, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+