Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీసేనకు మహర్దశ: బిజినెస్ క్లాస్‌లో టీమిండియా

హైదరాబాద్: ఇకపై టీమిండియా బిజినెస్‌ క్లాస్‌లో విహరించనుంది. స్వదేశంలో జరిగే మ్యాచ్‌ల కోసం భారత జట్టులోని ఆటగాళ్లు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విమానంలో వెళ్లే సంగతి తెలిసిందే. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లు ఎకానమీ క్లాస్‌లో వెళ్తున్నారు. అయితే ఇకపై ఆటగాళ్లు బిజినెస్‌ క్లాస్‌లో వెళ్లేలా బీసీసీఐ వెసులుబాటు కల్పించింది.

ఈ ప్రతిపాదనను త్వరలో అమలు చేయాలని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా బీసీసీఐ అధికారులకు లేఖ రాశారు. ఎకానమీ క్లాసులో ఆటగాళ్లు ప్రయాణిస్తున్న సమయంలో అభిమానుల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. అంతేకాదు ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు దిగాలని కోరుతున్నారు.

Team India likely to get business class upgrade for domestic air travels

ఈ సమస్యలను కెప్టెన్‌ కోహ్లీ కూడా పలుమార్లు బీసీసీఐ దృష్టికి తీసుకువచ్చాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరగా ఆటగాళ్లు బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించేలా ఏర్పాట్లు చేయాలని తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా బీసీసీఐ అధికారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+