For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముక్కోణపు టీ20 సిరిస్: లంకకు బయల్దేరిన రోహిత్ సేన

By Nageshwara Rao
Team India leaves for Sri Lanka for Nidahas T20 Trophy

హైదరాబాద: ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాల్గొనేందుకు గాను రోహిత్‌శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఆదివారం శ్రీలంకకు బయల్దేరి వెళ్లింది. కొలంబోకు వెళ్లే ముందు ఆటగాళ్లందరూ ముంబై విమానాశ్రయంలో కలిసి దిగిన ఫొటోలను బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్ ఆటగాళ్లు ధోని, భువనేశ్వర్, బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సెలెక్షన్ కమిటీ ఈ సిరిస్‌లో కొత్త కుర్రాళ్లకు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌తో పాటు దీపక్ హుడా, సుందర్, విజయ్ శంకర్, రిషబ్ పంత్‌లు చోటు దక్కించుకున్నారు.

శ్రీలంక స్వాతంత్య్ర వచ్చి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. టోర్నీలో భాగంగా ప్రారంభ మ్యాచ్ మంగళవారం ఆతిథ్య శ్రీలంక, భారత్ మధ్య జరగనుంది. ఒక్కో జట్టు మరో జట్టుతో రెండేసి సార్లు ఆడుతాయి. టాప్‌లో నిలిచిన రెండు జట్లు ఈనెల 18న జరిగే ఫైనల్లో తలపడుతాయి.

ఫైనల్‌ సహా ఈ మ్యాచ్‌లన్నిటికీ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సిరీస్‌కు మ్యాచ్ రిఫరీగా క్రిస్ బ్రాడ్‌ను నియమించినట్లు సమాచారం. బ్రాడ్ ఇప్పటి వరకు 461 అంతర్జాతీయ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించాడు. అందులో 93 టెస్టులు, 294 వన్డేలు, 74 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి.

ముక్కోణపు టీ20 సిరిస్‌కు భారత జట్టు:
Rohit Sharma (captain), Shikhar Dhawan (vice-captain), KL Rahul, Suresh Raina, Manish Pandey, Dinesh Karthik (wk), Deepak Hooda, Washington Sundar, Yuzvendra Chahal, Axar Patel, Vijay Shankar, Shardul Thakur, Jaydev Unadkat, Mohammad Siraj, Rishabh Pant (wk).

ముక్కోణపు టీ20 సిరిస్ షెడ్యూల్:
1st Match
- 6 March, Tuesday
Sri Lanka vs India

2nd Match - 8th March, Thursday
Bangladesh vs India

3rd Match - 10th March, Saturday
Sri Lanka vs Bangladesh

4th Match - 12th March, Monday
Sri Lanka vs India

5th Match - 14th March, Wednesday
Bangladesh vs India

6th Match - 16th March, Friday
Sri Lanka vs Bangladesh

Final - 18th Match, Sunday

Story first published: Monday, March 5, 2018, 8:41 [IST]
Other articles published on Mar 5, 2018
Read in English: India leave for Sri Lanka
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+