Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లివింగ్ లెజెండ్: రవిశాస్త్రి ధోనీ పాట, యువీకి మొండిచేయి

కొలంబో: టీమిండియా హెడ్ కోచ్ రవిశాత్రి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాట అందుకున్నాడు. ధోనీని ప్రశంసలతో ముంచెత్తాడు. లివింగ్ లెజెండ్ అంటూ ఆకాశానికెత్తాడు. మహీది అదే స్థాయి అంటూ చెప్పుకొచ్చాడు. అపార అనుభవజ్ఞుడైన ఈ మాజీ సారథి జట్టుపై చూపే ప్రభావం మాటల్లో చెప్పలేనదని అన్నాడు.

తాను ఇప్పటికీ బెస్ట్‌ ఫినిషర్‌నే అని శ్రీలంకతో వన్డే సిరీస్‌లో నిరూపించుకున్న ధోనీని కెప్టెన్‌, కోచ్‌లిద్దరూ ప్రస్తుతించడమేకాదు, వచ్చే వన్డే ప్రపంచకప్‌ జట్టులో మహీ స్థానం ఖాయమని కోచ్‌ స్పష్టం చేశాడు. టీమిండియా ఇప్పటినుంచే పరిమిత ఓవర్ల ప్రపంచకప్‌నకు సిద్ధమవుతోంది.

అందులో భాగంగానే శ్రీలంకతో వన్డే సిరీస్‌లో ప్రయోగాలు చేస్తోంది. ఈ తరుణంలో 36 ఏళ్ల మాజీ కెప్టెన్‌ ధోనీపై అందరి దృష్టీ నిలిచింది. లంకతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో సత్తా చాటకపోతే వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో అతడికి స్థానం అనుమానమే నంటూ మహీ భవితపై ఈ మధ్య వస్తున్న వార్తలకు రవిశాస్త్రి కళ్లెం వేసాడు.

సగం కూడా పూర్తి చేయలేదు...

సగం కూడా పూర్తి చేయలేదు...

జార్ఖండ్‌ డైనమైట్‌ ఇంకా తన కెరీర్‌లో సగం కూడా పూర్తి చేయలేదని రవిశాస్త్రి తేల్చాడు. శ్రీలంకపై గత మూడు ఇన్నింగ్స్‌ల్లో అజేయంగా 45, 67, 49 పరుగు లు చేయడమేకాదు.. తాను వరల్డ్‌ బెస్ట్‌ ఫినిషర్‌నని కూడా ధోనీ నిరూపించుకున్నాడు. గత మ్యాచ్‌ అత డికి 300వ వన్డే కావడం విశేషం. ఈ నేపథ్యంలో 2019 ప్రపంచకప్‌ లక్ష్యంగా జట్టులో ప్రయో గాలు చేస్తున్న తమ ప్రణాళికలో ధోనీ తప్పకుండా ఉన్నాడని ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి చెప్పాడు.

లివింగ్‌ లెజెండ్‌ మహీ...

లివింగ్‌ లెజెండ్‌ మహీ...

జట్టుపై మహీ ప్రభావం చెప్పనలవి కాదని, డ్రెస్సింగ్‌ రూమ్‌లో అతడు ‘లివింగ్‌ లెజెండ్‌' అని రవిశాస్త్రి అన్నాడు. క్రికెట్‌ ఆటకు ధోనీ అలంకారమని, ఎవరెన్ని ఊహాగానాలు చేసుకున్నా మహీ స్థానానికి ఇప్పట్లో ఢోకాలేదని చెప్పాడు. ధోనీ కెరీర్‌ ముగింపు దశకు వచ్చిందని ఎవరైనా భావిస్తే వారు పొరపాటు పడినట్లేనని అన్నాడు. ఈ వెటరన్‌లో ఇంకా ఎంతో సత్తా ఉందని వ్యాఖ్యానించాడు. కేవలం సుదీర్ఘకాలంపాటు ఆడుతున్నాడన్న కారణంగానే అతడికి ప్రత్యామ్నాయం చూడాలని మీరు భావిస్తున్నారా అని ఎదురు ప్రశ్న వేసాడు.

36 ఏళ్లని సన్నీ, సచిన్‌ను తప్పిస్తామా ?

36 ఏళ్లని సన్నీ, సచిన్‌ను తప్పిస్తామా ?

ధోనీని తప్పిస్తారన్న వార్తలను రవిశాస్త్రి తోసిపుచ్చాడు. 36 ఏళ్లు వచ్చాయని గవాస్కర్‌నో, సచిన్‌నో తప్పించామా? అని అడిగాడు. ధోనీ ఇప్పటికీ ఉత్తమ క్రికెటర్‌ అని అలాంటిది అతడిని తొలగించాలన్న ఆలోచన ఎలా వస్తుందని అన్నాడు. ప్రపంచకప్‌లోపు భారత్‌ సుమారు 40 వన్డేలు ఆడాల్సి ఉన్నందున జట్టులో ప్రయోగాలు, రొటేషన్‌ ముఖ్యమని చెప్పాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పాడు.

ఫిట్‌నెస్‌లో రాజీలేదు

ఫిట్‌నెస్‌లో రాజీలేదు

జట్టు ఎంపికలో ఫిట్‌నెస్‌కే ప్రథమ ప్రాధాన్యమంటున్న సెలెక్టర్లను రవిశాస్త్రి పూర్తిగా సమర్థించాడు. అత్యుత్తమ ఫీల్డింగ్‌ ప్రమాణాలున్న జట్టును రూపొందించడం తమ లక్ష్యమని అన్నాడు. ఫిట్‌నెస్‌ ఉంటేనే కదా ఉత్తమ ఫీల్డింగ్‌ జట్టు తయా రయ్యేదని, అందుకు ఫిట్‌నెస్‌కు సంబంధించి ప్రమాణాలు నిర్ణయించామని చెప్పాడు.

రైనా, యువీలకు ఆశలు గల్లంతు...

రైనా, యువీలకు ఆశలు గల్లంతు...

ఫిట్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకుంటే వరల్డ్‌ కప్‌ ప్రణాళికల్లో యువరాజ్‌, సురేష్ రైనా లేనట్టేనా అని మీడియా ప్రతినిధులు పదే పదే అడిగినప్పుడు అవునని రవిశాస్త్రి చెప్పాడు. ఫిట్‌నెస్‌కు పారామీటర్లు నిర్ణ యించి, అవే జట్టు విజన్‌గా పేర్కొన్నప్పుడు..ప్రతి ఆటగాడు వాటిని చేరుకోవాల్సిందేనని అన్నాడు.

సెలెక్షన్‌లో వేలు పెట్టను..

సెలెక్షన్‌లో వేలు పెట్టను..

జట్టు ఎంపికలో తాను జోక్యం చేసుకొనే ప్రసక్తే లేదని రవిశాస్త్రి చెప్పాడు. జట్టు సభ్యులు తనను నమ్మా లని భావిస్తున్నట్లు తెలిపాడు. అందుకే సెలెక్షన్‌ లో ఎప్పుడూ జోక్యం చేసు కోనని, అది సెలెక్టర్ల పని' అని ఆయన చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+