Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ ఫామ్‌పై వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ షాకింగ్ కామెంట్స్‌!

 “Team India fortunate to have MS Dhoni in dressing room”, says VVS Laxman

బ‌ర్మింగ్‌హామ్‌: టీమిండియా వికెట్ కీప‌ర్, మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ మ‌హేంద్రసింగ్ ధోనీ ఫామ్‌పై కొంత‌కాలంగా క్రికెట్ ప్ర‌పంచంలో చ‌ర్చ న‌డుస్తోంది. ధోనీ బ్యాటింగ్ శైలిని వేలెత్తి చూపుతున్నారు. అత‌ని బ్యాటింగ్ మ‌రీ మంద‌కొడిగా ఉంద‌ని, న‌త్త న‌డ‌క‌న సాగుతోందంటూ విమ‌ర్శిస్తున్నారు. ఈ విమ‌ర్శ‌కుల జాబితాలో టీమిండియా మాజీ కేప్టెన్, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్, మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా ఉన్నారు. ధోనీ త‌న స‌హ‌జ సిద్ధ బ్యాటింగ్‌ శైలికి భిన్నంగా ఆడుతున్నాడ‌ని, ప్ర‌త్యేకించి- స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొన‌డంలో పూర్తిగా ర‌క్ష‌ణాత్మ‌క స్థితికి చేరుకున్నాడ‌ని విమ‌ర్శించారు. స్పిన్ బౌలింగ్ ప‌ట్ల అతిగా జాగ్ర‌త్త ప‌డుతున్నాడ‌ని అన్నారు. ఈ ప‌రిస్థితుల్లో టీమిండియా మాజీ టెస్ట్ క్రికెట‌ర్‌, హైద‌రాబాదీ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ సైతం త‌న నోరు విప్పాడు. ధోనీ బ్యాటింగ్ శైలిపై తొలిసారిగా స్పందించాడు.

ధోనీ జ‌ట్టులో ఉండ‌ట‌మే ఓ అదృష్టం..

ధోనీ జ‌ట్టులో ఉండ‌ట‌మే ఓ అదృష్టం..

మ‌హేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌ను త‌ప్పు ప‌ట్టడం అవివేక‌మ‌ని వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌ కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు. అత‌ని బ్యాటింగ్ శైలిని త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నాడు. ధోనీ జ‌ట్టుతో ఉండ‌ట‌మే ఓ అదృష్టంగా భావించాల‌ని, అత‌ని అనుభ‌వం జ‌ట్టుకు అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నాడు. ప్ర‌పంచ‌క‌ప్ వంటి మెగా టోర్న‌మెంట్‌ను ఆడుతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ధోనీ వంటి అనుభ‌వ‌జ్ఞుడైన ఆట‌గాడు జ‌ట్టులో ఉండాల‌ని అన్నాడు. జ‌ట్టు మొత్తం యువ‌ర‌క్తంతో నిండి ఉన్న‌ప్పుడు ధోనీ వంటి ఆట‌గాడి నుంచి మెళ‌కువ‌ల‌ను నేర్చుకోవాల‌ని సూచించాడు. ఒక్కో మ్యాచ్‌లో నెమ్మ‌దిగా ఆడాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డ‌వ‌చ్చ‌ని దీన్ని త‌ప్పు ప‌ట్ట‌డం స‌రికాద‌ని చెప్పాడు. బ్యాటింగ్ శైలి అనేది ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బౌలింగ్‌, పిచ్‌, వాతావ‌ర‌ణంపై ఆధార ప‌డి ఉంటుంద‌ని వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ అభిప్రాయ‌ప‌డ్డాడు. బౌలింగ్ ప‌దునుగా ఉన్న‌ప్పుడు భారీ షాట్ల‌ను ఆడ‌టం వ‌ల్ల వికెట్‌ను పారేసుకుంటున్న‌ట్టుతుంద‌ని చెప్పాడు. పిచ్‌కు అనుగుణంగా త‌న బ్యాటింగ్ శైలిని అప్ప‌టిక‌ప్పుడు మార్చుకునే స‌త్తా ధోనీకి ఉంద‌ని అన్నాడు.

ఫైన‌ల్ చేరేవి ఆ రెండు జ‌ట్లే..

ఫైన‌ల్ చేరేవి ఆ రెండు జ‌ట్లే..

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ఫైన‌ల్ చేర‌బోయేవి ఆస్ట్రేలియా, భార‌త్ మాత్ర‌మేన‌ని వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ అంచ‌నా వేశాడు. ప్ర‌స్తుతానికి ఈ రెండు జ‌ట్ల మధ్యే గ‌ట్టి పోటీ నెల‌కొని ఉంద‌ని అన్నాడు. సెమీ ఫైన‌ల్ ఎవ‌రు? ఎవ‌రితో త‌ల‌ప‌డిన‌ప్ప‌టికీ.. ఫైన‌ల్‌లో మాత్రం ఆస్ట్రేలియా, భార‌త్ జ‌ట్లే ఆడ‌తాయ‌ని ఆయ‌న జోస్యం చెప్పాడు. ఆస్ట్రేలియా, భార‌త్ జ‌ట్ల మ‌ధ్యే ప్ర‌పంచ‌క‌ప్ విజేత ఎవ‌ర‌నే విష‌యంపై పోటీ నెల‌కొని ఉంద‌ని అన్నాడు. ప్ర‌పంచ‌క‌ప్ విజేతగా ఎవ‌రు ఆవిర్భ‌విస్తార‌నే విష‌యాన్ని ఇప్పుడే చెప్ప‌డం తొంద‌ర‌ప‌డిన‌ట్ట‌వుతుంద‌ని వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ చెప్పుకొచ్చాడు. ప్ర‌పంచ‌క‌ప్‌ను సాధించే అర్హ‌త‌, ముద్దాడే శ‌క్తి సామ‌ర్థ్యాలు ఆస్ట్రేలియా, టీమిండియాల‌కు మాత్ర‌మే ఉంద‌ని తేల్చి చెప్పాడు.

దినేష్ కార్తీక్ బెస్ట్ ఛాయిస్‌..

దినేష్ కార్తీక్ బెస్ట్ ఛాయిస్‌..

బ‌ర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియంలో జ‌రిగే మ్యాచ్‌లో నంబ‌ర్ ఫోర్ స్థానంలో విజ‌య్ శంక‌ర్‌కు బ‌దులుగా దినేష్ కార్తీక్‌ను తీసుకుంటే బాగుంటుంద‌నేది త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మ‌ని అన్నాడు. దినేష్ కార్తీక్‌ను జ‌ట్టులోకి తీసుకోవ‌డం వ‌ల్ల మిడిలార్డ‌ర్ బ‌లోపేతమౌతుంద‌ని వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌ను తొలిసారిగా ఎదుర్కొంటుండ‌టం వ‌ల్ల విజ‌య్ శంక‌ర్ ఒత్తిడికి గుర‌వుతున్నాడ‌ని చెప్పాడు. అత‌ని స్థానంలో దినేష్ కార్తీక్‌ను తీసుకుంటే బ్యాటింగ్ లైన‌ప్ దృఢ‌ప‌డుతుంద‌ని అన్నాడు. ఇంగ్లండ్ స‌హా ప‌లు అంతర్జాతీయ మ్యాచ్‌ల‌ను ఆడిన అనుభ‌వం దినేష్ కార్తీక్‌కు ఉంద‌ని, అత‌ణ్ని తుది జ‌ట్టులోకి తీసుకునే దిశ‌గా టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచ‌న చేయాల‌ని వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ అన్నాడు.

Story first published: Sunday, June 30, 2019, 12:24 [IST]
Other articles published on Jun 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+