Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : ఆడుంటే రాహుల్ కెరీర్ ఖతం.. ఇండోర్ పిచ్‌పై మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

Team India Former selector slams Indore pitch

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా స్టార్ ఓపెన్ కేఎల్ రాహుల్‌ను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఫామ్‌ లేక తంటాలు పడుతున్న అతన్ని టీం మేనేజ్‌మెంట్ పక్కన పెట్టేసింది. ఈ
టెస్టు సిరీసులో తొలి రెండు మ్యాచుల్లో అతను చాలా ఘోరంగా ఆడాడు. దీంతో చాలా మంది అభిమానులు, మాజీలు రాహుల్‌ను ఆడించడంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే అతన్ని మూడో టెస్టులో ఆడించలేదు.

ఆడుంటే రాహుల్ కెరీర్ ఖతం..

ఆడుంటే రాహుల్ కెరీర్ ఖతం..

దీనిపై మాజీ సెలెక్టర్, టీమిండియా లెజెండ్ కృష్ణమాచారి శ్రీకాంతో కీలక వ్యాఖ్యలు చేశాడు. 'అన్నిటి కన్నా ముందు ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ ఆడనందుకు సంతోషిస్తున్నా. అతను ఇలాంటి పిచ్‌పై ఆడకపోవడమే చాలా మంచిది. తొలి రెండు టెస్టుల్లో ఫెయిలైన అతను మిగతా రెండు మ్యాచుల్లో కూడా ఫెయిలై ఉంటే అతని టెస్టు కెరీర్ ముగిసిపోయేది. అందుకే అతను ఆడనందుకు చాలా సంతోషిస్తున్నా' అని తేల్చేశాడీ మాజీ లెజెండ్. ఇండోర్‌లో తయారు చేసిన పిచ్‌పై ఎవరైనా సరే పరుగులు చేయడం కష్టమే అని చెప్పాడు.

పరుగులు చేయలేం..

పరుగులు చేయలేం..

ఇలాంటి పిచ్‌లపై ఎంత గొప్ప బ్యాటర్ కైనా పరుగులు చేయడం కష్టమేనని, అదే సమయంలో బౌలర్లకు మాత్రం వికెట్లు సులభంగా దొరుకుతాయని శ్రీకాంత్ వివరించాడు. 'ఈ పిచ్‌లపై ఎవరైనా సరే.. అది విరాట్ కోహ్లీ అయినా ఇంకెవరైనా సరే భారీగా పరుగులు మాత్రం చెయ్యలేరు. మ్యాచ్ చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆసీస్ స్పిన్నర్ కునేమన్ తొలి ఇన్నింగ్స్‌లోనే బంతిని అద్భుతంగా మానిప్యులేట్ చేయగలిగాడు. ఇలాంటి పిచ్‌లపై వికెట్లు తీయడం పెద్ద మ్యాటరే కాదు. నేను బౌలింగ్ చేసినా వికెట్లు పడేవి. ఇదే నిజం. దాన్ని మనం అంగీకరించకతప్పదు' అని స్పష్టం చేశాడు.

ఇండోర్ పిచ్‌పై ఐసీసీ గుస్సా..

ఇండోర్ పిచ్‌పై ఐసీసీ గుస్సా..

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా ఇండోర్ పిచ్‌కు పూర్ రేటింగ్ ఇచ్చింది. మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఈ పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటు, బంతి మధ్య మంచి పోటీని ఈ పిచ్ అందించలేకపోయిందని చెప్పిన అతను.. ఈ వెన్యూకు మూడు డీమెరిట్ పాయింట్స్ ఇచ్చాడు. దీని గురించి కూడా మాట్లాడిన శ్రీకాంత్.. 'ఇది టెస్టు క్రికెట్‌కు ఏమాత్రం మంచిది కాదు. వాళ్లు ఈ విషయంలో చాలా తప్పు చేస్తున్నారు. 2008 సిరీస్ చూస్తే.. అప్పుడు పిచ్‌లు ఇంత ర్యాంక్ టర్నర్‌లు కాదు. కానీ భారత్ ఈ సిరీస్‌ను 2-0తో గెలిచింది. కానీ ఇక్కడ బంతి మొదటి రోజు నుంచే టర్న్ అవుతోంది. ఈ పిచ్‌లపై బ్యాటింగ్ చూడటమే చాలా కష్టంగా ఉంది. మళ్లీ చెప్తున్నా.. టెస్టు క్రికెట్‌కు ఇది ఏమాత్రం మంచిది కాదు' అని శ్రీకాంత్ పేర్కొన్నాడు.

Story first published: Sunday, March 5, 2023, 15:12 [IST]
Other articles published on Mar 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+