Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA 2nd T20: 24బంతుల పాటు ఒక్క బౌండరీ కొట్టని ఇండియా, 23బంతుల పాటు సౌతాఫ్రికా..!

shreyas iyer

దక్షిణాఫ్రికాతో కటక్‌లో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన టెంబా బవుమా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలుత ఇషాన్ కిషన్ (34పరుగులు 21బంతుల్లో), శ్రేయస్ అయ్యర్ (40పరుగులు 35బంతుల్లో), దినేష్ కార్తీక్ (30పరుగులు 21బంతుల్లో) రాణించడంతో 20ఓవర్లకు 6వికెట్లు కోల్పోయి 148పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి.. టీమిండియా స్కోరుకు కళ్లెం వేశారు. అన్రిచ్ నార్జ్ 2వికెట్లు తీయగా.. రబాడా 4ఓవర్లలో 15పరుగులే ఇచ్చి 1వికెట్ తీసి రాణించారు. ఇక పార్నెల్, ప్రిటోరియస్, మహరాజ్ తలా ఒక వికెట్ తీసి టీమిండియాను కట్టడి చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు మిడిల్ ఓవర్లలో చాలా డిఫెన్స్ ఆడారు.

13ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 4వికెట్లు 92పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యార్ ఉన్నారు. 14వ రెండో బంతికి అక్షర్ పటేల్ ఫోర్ కొట్టాడు. ఇక ఆ తర్వాత మళ్లీ 18వ ఓవర్ 3వ బంతి దాకా బౌండరీ రాలేదు. ఇక 24బంతుల పాటు అంటే 4ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు. ఈ ఓవర్లలో సౌతాఫ్రికా బౌలర్లు అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యార్‌లను ఔట్ చేశారు. దీంతో స్కోరు వేగం పూర్తిగా మందగించింది. టీ20 మ్యాచ్‌లో కీలక ఓవర్లలో 24బంతుల పాటు ఒక్క ఫోర్ కూడా రాకపోవడం బట్టి ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు ఎంత ప్రభావవంతంగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. 13.3నుంచి 17.2 ఓవర్ల మధ్య టీమిండియా కేవలం 15పరుగులు మాత్రమే చేసింది. 17.3బంతికి హర్షల్ పటేల్ 4కొట్టడంతో మళ్లీ స్కోరు బోర్డుకు కాస్త మూమెంటమ్ వచ్చింది. హర్షల్ పటేల్ (12పరుగులు 9బంతుల్లో 2ఫోర్లు నాటౌట్), దినేష్ కార్తీక్ చివరి మూడు ఓవర్ల పాటు ఆడారు. తద్వారా భారత్ స్కోరు 148కి చేరుకుంది.
ఇక టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ నిప్పులు (3-10) చెరగడంతో పవర్ ప్లేలో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే దెబ్బతగలింది. రీజా హెండ్రిక్స్ (4), డ్వేన్ ప్రిటోరియస్ (4), రాస్సీ వాన్ డర్ డుసెన్ (1)లను భువీ తన స్వింగ్ మాయాజాలంతో పెవిలియన్ కు పంపించాడు. ఇక దక్షిణాఫ్రికా బ్యాటర్లు సైతం 4.3ఓవర్ల నుంచి 8.1ఓవర్ల మధ్య ఒక్క బౌండరీ బాదలేదు. అంటే 23బంతుల పాటు ఎలాంటి బౌండరీ రాలేదు. దీంతో ఇండియా ఒకానొక దశలో దక్షిణాఫ్రికా కంటే ఆధిపత్యం కనబర్చింది.

తుది జట్లు :
టీమిండియా ప్లేయింగ్ XI : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI : టెంబా బావుమా( కెప్టెన్ ), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డ్వైన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబాడ, అన్రిచ్ నార్జ్

Story first published: Sunday, June 12, 2022, 22:18 [IST]
Other articles published on Jun 12, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+