Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్-వెస్టిండీస్ మ్యాచ్: మనోళ్లు ఈజీ క్యాచ్‌లు వదిలేస్తేనే...

పెర్త్: వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యచ్‌లో భారత జట్టు ఫీల్డర్లు 5 సులభమైన క్యాచ్‌లు వదిలేశారు. భారత ఆటగాళ్లు ఈ క్యాచ్‌లు పట్టి ఉంటే వెస్టిండీస్ మరింత తక్కువ స్కోరు చేసి ఉండేది. వెస్టిండీస్ 183 పరుగులకే ఆలౌటైంది. అయితే, ఆ క్యాచ్‌లు పడితే మరింత తక్కువ స్కోరు చేసేది.

క్రిస్ గేల్‌కు ఇచ్చిన రెండు మూడు క్యాచ్‌లను భారత జట్టు వదిలేసింది. అయితే, ఆ క్యాచ్‌లు వదిలేసినా అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. విండీస్ కెప్టెన్ హోల్డర్ అర్ధ సెంచరీ పూర్తి చేసేందుకు రోహిత్ శర్మ సహకరించినట్లయింది.

ఉమేష్ యాదవ్ బౌలింగులో 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హోల్డర్ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్ శర్మ వదిలేశాడు. రవీంద్ర జడెజా, సురేష్ రైనాలు కూడా క్యాచ్‌లు వదిలేశారు. బౌలింగులో అద్భుత ప్రదర్శన ఇచ్చిన భారత జట్టు ఫీల్డింగులో ఈసారి ఆకట్టుకోలేదు.

Team India failed in fielding

భారత జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో మన జట్టు మరోసారి ప్రపంచ కప్ గెలిస్తే.. అరుదైన రికార్డ్ సొంతమవుతుంది. 1983లో భారత్ ప్రపంచకప్ గెలిచింది. ఆ తర్వాత 28 ఏళ్లకు ధోనీ నేతృత్వంలో భారత్ 2011లో ప్రపంచకప్ సాధించింది. ఈసారి కూడా ధోనీ సేన పైన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

ధోనీ సారథ్యంలో భారత్ రెండోసారి ప్రపంచకప్ గెలిస్తే.. ఈ ఘనత సాధించిన వెస్టిండీస్, ఆస్ట్రేలియా దిగ్దజాలు క్లైవ్ లాయిడ్, రికీ పాంటింగుల సరసన నిలుస్తాడు.

ఇది 11వ ప్రపంచకప్. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా నాలుగుసార్లు, వెస్టిండీస్ రెండుసార్లు, భారత్ ఒకసారి, పాకిస్తాన్, శ్రీలంకలు ఒక్కోసారి ప్రపంచ కప్ గెలిచాయి. 1975, 1979లలో క్లైవ్ లాయిడ్ సారథ్యంలో వెస్టిండీస్ రెండుసార్లు, 2003, 2007లలో రికీ పాంటింగ్ నాయకత్వంలో ఆసీస్ రెండుసార్లు ప్రపంచ కప్ గెలిచింది.

ఇప్పుడు ధోనీ సారథ్యంలో భారత్ కూడా వరుసగా రెండుసార్లు కప్ గెలిస్తే రికార్డ్ సృష్టించినట్లే. ధోనీ ఆ దిగ్గజాల సరసన నిలుస్తారు. ధోనీ సేన నాకౌట్ బెర్త్ సొంతం చేసుకున్నట్లే. అయితే, క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లలో నెగ్గాల్సి ఉంది. ధోనీ సేన చరిత్ర సృష్టించేందుకు మరో మూడు అడుగుల దూరంలోనే ఉంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+