Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదెక్కడి ఎక్స్‌పెరిమంట్రా..12 నెలల్లోతొమ్మిది మంది ఓపెనర్లా?: రోహిత్‌కు కుదరని జోడీ

 Team India experiment continues in T20Is opening combination as Suryakumar Yadav promoted

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత క్రికెట్ జట్టు వరుస విజయాలను సాధిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని సరికొత్త ప్రయోగాలు తెరమీదికి వస్తోన్నాయి. ప్లేయర్ల ఆటతీరును పక్కన పెడితే- ఈ ప్రయోగాలు జట్టు విజయావకాశాలను దెబ్బ తీయకపోవడం ఇంట్రస్టింగ్‌గా మార్చింది. ఇంకో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ మెగా టోర్నమెంట్ ఆరంభం కానున్న నేపథ్యంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దీనికి శ్రీకారం చుట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఫిక్స్డ్ ఓపెనర్ ఎవరు?

ఫిక్స్డ్ ఓపెనర్ ఎవరు?

ఈ వ్యవహారం అంతా ఓపెనింగ్ జోడీని సెంటర్ ఆఫ్ ది పాయింట్‌గా చేసుకుంది. టీ20 ఇంటర్నేషనల్స్‌లో కేప్టెన్ రోహిత్ శర్మకు జోడీ ఎవరనేది ఫిక్స్ కాకపోవడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయనేది స్పష్టమౌతోంది. సాధారణంగా టీ20ల్లో రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ జోడీ ఇన్నింగ్‌ను ఆరంభిస్తుంటుంది. గాయం వల్ల కేఎల్ రాహుల్ క్రికెట్ దూరం అయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు బ్యాట్ పట్టలేదతను.

 నిలకడ లేని జోడీ..

నిలకడ లేని జోడీ..

కేఎల్ రాహుల్ దూరమైన ప్రభావం ఇన్నింగ్ ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్‌పై పడుతోంది. ఒక్కో సిరీస్‌కు ఒక్కో కొత్త ఓపెనర్ తెరమీదికి వస్తోన్నాడు. అతను వ్యక్తిగతంగా ఎలా ఆడుతున్నాడనేది పక్కన పెడితే- జట్టు విజయావకాశాలను పెద్దగా ప్రభావితం చేయట్లేదు గానీ రోహిత్ శర్మకు సరైన జోడీ దక్కట్లేదనేది తేల్చేస్తోంది. ఓపెనింగ్ జోడీ నిలకడగా ఉండట్లేదనేది తేలిపోతోంది.

ఓపెనర్‌గా సూర్య..

ఓపెనర్‌గా సూర్య..

వెస్టిండీస్‌తో అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. ఓపెనర్ అవతారాన్ని ఎత్తాల్సి వచ్చింది. 2018లో తప్ప ఐపీఎల్‌ మ్యాచ్‌లల్లో కూడా అతను ఇన్నింగ్‌ను ఆరంభించిన సందర్భాలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో అతను కేప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్‌ను ఆరంభించాడు. తన మార్క్ షాట్లను ఆడగలిగాడు గానీ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయాడు. 16 బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్స్‌తో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

 ఇప్పటివరకు ఇదీ..

ఇప్పటివరకు ఇదీ..

ఓపెనింగ్ జోడీని మార్చడం టీమిండియాకు ఇది కొత్తేమీ కాదు. ఈ 12 నెలల కాలంలో ఏకంగా తొమ్మిది మందిని ఓపెనర్లుగా బరిలోకి దించింది. రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్, కేఎల్ రాహుల్-ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్-ఇషాన్ కిషన్, సంజు శాంసన్-రోహిత్ శర్మ, దీపక్ హుడా-ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ-రిషభ్ పంత్ ఇన్నింగ్‌ను ఆరంభించిన మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా సూర్యకుమార్ యాదవ్ కూడా రోహిత్ శర్మకు జత కట్టాడు.

ఈ జోడీ కొనసాగుతుందా?

ఈ జోడీ కొనసాగుతుందా?

రోహిత్ శర్మ-సూర్యకుమార్ యాదవ్ ఓపెనింగ్ జోడీ కూడా సుదీర్ఘకాలం పాటు కొనసాగదనేది తెలిసిన విషయమే. అయిదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా ఉంటాడనే గ్యారంటీ కూడా లేదు. అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను క్రీజ్‌లోకి దించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా- జట్టు విజయాలకు ఢోకా లేనందున కేఎల్ రాహుల్ జట్టులో పునరాగమనం చేసేంత వరకూ ఈ ప్రయోగాలు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Saturday, July 30, 2022, 10:49 [IST]
Other articles published on Jul 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+