
హైదరాబాద్: ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న వరల్డ్‌కప్ మైదానాలపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. "రోస్‌బౌల్ మైదానం(సౌతాంప్టన్)లా రోటీ చేద్దామనుకున్నా.. కానీ అది హెడింగ్లీ (లీడ్స్) మైదానంలా అయ్యింది. మీ రోటీ ఏ మైదానంలా ఉంది?" అంటూ సెహ్వాగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అయింది. ఇంగ్లాండ్‌లోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే, వరల్డ్‌కప్‌కు ఆతిథ్యిమిస్తోన్న ఈ 11 వేదికల్లో ఒక్క సౌతాంప్టన్ మాత్రమే గుండ్రంగా ఉంది. మిగలిన మైదానాలన్నీ కూడా సరైన రూపంలో లేవు. ముఖ్యంగా బౌండరీ లైన్‌లు క్రమపద్ధతిలో లేవు.
లీడ్స్ మైదానం గురించి చెప్పాల్సిన పని లేదు. ఇరు వైపుల ఉండే బౌండరీ దూరాల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఈ వరల్డ్‌కప్‌లో బ్యాటింగ్ పిచ్‌గా రూపొందించిన నాటింగ్‌హామ్ గ్రౌండ్ అయితే, మిడ్‌వికెట్ బౌండరీ 64 మీటర్లే ఉండగా, ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో కూడా అన్నింటికంటే తక్కువగా 60 మీటర్లకే బౌండరీ లైన్ ఉంది.
ప్రస్తుతం ఈ మైదానాలకు సంబంధించి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోను సెహ్వాగ్ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. మే30న ఆరంభమైన ఈ వరల్డ్ కప్ మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999).
1975 నుంచి 1987 మధ్య జరిగిన నాలుగు వరల్డ్‌కప్‌ల్లో జట్లను గ్రూప్‌లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించారు. అయితే, మే30 నుంచి ఆరంభమయ్యే 12వ ఎడిషన్ వరల్డ్‌కప్‌ను మాత్రం రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. 1992 వరల్డ్‌కప్‌ను ఈ విధంగానే నిర్వహించారు. ఫలితంగా ప్రతి జట్టు 9 మ్యాచ్‌లు చొప్పున ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.