For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ తర్వాత టీమిండియానే: 37 విజయాలతో 2017కు వీడ్కోలు

By Nageshwara Rao
Team India ends 2017 with record 37 wins

హైదరాబాద్: భారత క్రికెట్ చరిత్రలో 2017కు ఎంతో ప్రత్యేకతమైన స్ధానం ఉంది. ఈ ఏడాది టీమిండియా ఎన్నో ఘనమైన విజయాలను సొంతం చేసుకుంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను భారత జట్టు 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. చివరిదైన మూడో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ విజయంతో 2017లో అన్ని ఫార్మాట్లలో కలిసి సాధించిన విజయాల సంఖ్య 37కు చేరింది. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విజయాలను సాధించిన జట్ల జాబితాలో భారత్ రెండో స్ధానంలో నిలిచింది. 38 విజయాలతో ఆస్ట్రేలియా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 2003లో ఆస్ట్రేలియా 47 మ్యాచ్‌లాడి 38 విజయాలను సాధించింది.

లంకపై మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకోవడంతో భారత్ మరో ఘనతను కూడా సాధించింది. టీ20 చరిత్రలో టీమిండియా రెండు సార్లు 3-0తో సిరిస్‌ను కైవసం చేసుకున్నట్లైంది. 2016లో ఆసీస్‌పై 3-0తో గెలిచిన టీమిండియా తాజాగా శ్రీలంకపై మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.

2017లో టీమిండియా రికార్డు విజయాలు ఇలా:
ఆడిన టెస్టులు: 11, గెలిచినవి: 7, ఓడినవి: 1, డ్రా: 3
ఆడిన వన్డేలు: 29, గెలిచినవి: 21, ఓడినవి: 7, ఫలితం తేలనవి: 1
ఆడిన టీ20లు: 13, గెలిచినవి: 13, ఓడినవి: 4

మొత్తంగా 2017లో భారత్ విజయాల సంఖ్య 37, ఓడినవి 12

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 25, 2017, 20:43 [IST]
Other articles published on Dec 25, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+