Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అత్యధిక సిరీస్‌లు గెలుచుకుని రికార్డులకెక్కిన భారత్

Team India ends 2017 with its all-time best ODI record in a calendar year

హైదరాబాద్ : విశాఖపట్నం వేదికగా జరిగిన మూడో వన్డేతో టీమిండియా మరిన్ని రికార్డులను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌తో ఎనిమిది వరుస సిరీస్‌లను గెలిచిన ఘనత టీమిండియాకు దక్కింది. లంకేయులతో ఆఖరి వన్డేలో విజయంతో ఎనిమిది వరుస సిరీస్‌ విజయాల్ని భారత్‌ సొంతం చేసుకోవడంతో పాటు ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వన్డేలతో ఆల్‌ టైమ్‌ బెస్ట్‌ రికార్డును సాధించింది.

ఈ ఏడాది టీమిండియా 29 వన్డేలకు గాను 21 మ్యాచ్‌ల్లో విజయాన్ని కైవసం చేసుకుంది. ఒక మ్యాచ్ ఎటూ తెలియకపోగా ప్రణాళికా లోపంతో 7 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఫలితంగా ఈ ఏడాది భారత్‌కు గెలుపు ఓటమిల నిష్పత్తి 3.000గా నమోదైంది. వన్డే ఫార్మాట్‌లో భారత్‌కు ఆల్‌ టైమ్‌ బెస్ట్‌ రికార్డు ఇది.

ఆదివారం వన్డే మ్యాచ్ ప్రత్యర్థి శ్రీలంక మరొకవైపు చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ ఏడాది 29 వన్డేలు ఆడిన లంకేయులు ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించారు. 23 మ్యాచ్‌ల్లో పరాజయం పాలయ్యారు. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. వారి గెలుపు ఓటమిల నిష్పత్తి 0.217గా నమోదైంది. ఇది ఏ జట్టు పరంగా చూసినా ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యంత చెత్త స్కోరుగా రికార్డుకెక్కింది.

భారత్ స్వదేశంలో లంకతో 51 వన్డేలు ఆడింది. ఇందులో 36 విజయాల్ని సాధించి, 12 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. 1982 నుంచి చూస్తే భారత జట్టు సొంతగడ్డపై లంకేయులతో ఇప్పటివరకూ తొమ్మిది ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడగా తొమ్మిదింట విజేతగా నిలిచింది. ఇక ఒక సిరీస్‌ డ్రా అయ్యింది. మరొకవైపు ఈ ఏడాది భారత్‌ జట్టు తన వన్డే రన్‌ రేట్‌లో కూడా అత్యుత్తమ రికార‍్డును సాధించింది. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో భారత్‌ నమోదు చేసిన వన్డే రన్‌ రేట్‌ 5.93. ఈ క్యాలెండర్ ఇయర్ మొత్తంలో భారత్‌ అత్తుత్తమ రన్‌ రేట్‌ నమోదు చేసింది. 2009 నమోదు చేసిన భారత్ రన్ రేటు 5.88 నుంచి 5.93కు సవరించింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 18, 2017, 16:05 [IST]
Other articles published on Dec 18, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+