Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : సూర్య వర్సెస్ గిల్.. మిడిలార్డర్‌లో ఎవరిని ఆడించాలి?

Team India dilemma to pick Surya or Gill in first INDvsAUS Test

ప్రస్తుతం టీమిండియాను పట్టి పీడిస్తున్న సమస్య టీం సెలెక్షన్. శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ ఇద్దరూ ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడటం లేదు. పంత్ అయితే యాక్సిడెంట్ కారణంగా ఆటకు చాలా కాలం దూరమయ్యాడన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జట్టులో ఎవరిని ఆడించాలనేది పెద్ద తలనొప్పిగా మారింది. దానికితోడు శుభ్‌మన్ గిల్ కళ్లు చెదిరే ఫామ్‌లో ఉన్నాడు. అలాంటప్పుడు అతన్నే ఓపెనర్‌గా పంపాలా? అనేది కూడా ప్రశ్నగానే మిగిలింది.

అయితే టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. దీంతో అయ్యర్, పంత్ స్థానాలను భర్తీ చేయాల్సిన అవసరం మాత్రమే మిగిలింది. పంత్ స్థానంలో ఇషాన్ కిషన్, కేఎస్ భరత్‌లలో ఒకరికి చోటు దక్కుతుంది. ఈ విషయంలో భరత్‌కే ఓటెయ్యాలని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోందట. దీంతో ఇక మిగిలింది కేవలం ఐదో స్థానమే. ఈ స్థానం కోసం శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ పోటీ పడుతున్నారు.

పంత్ లేకపోవడంతో టీమిండియా బ్యాటింగ్‌లో ఫైర్ పవర్ తగ్గినట్లు కనిపిస్తోంది. దీన్ని పూరించుకోవడానికి సూర్యకు అవకాశం ఇవ్వాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను బట్టి గిల్‌ను ఆడించాలని మరికొందరు అంటున్నారు. అంతేకాదు స్పిన్‌ను ఎదుర్కోవడంలో గిల్ కూడా సమర్ధేడే అని, దానికితోడు లిస్ట్-ఎ క్రికెట్‌లో మిడిలార్డర్‌లో గిల్ డబుల్ సెంచరీ కూడా బాదాడని గుర్తు చేస్తున్నారు.

స్పెషలిస్టు ఓపెనర్‌గా గుర్తింపు పొందిన గిల్.. కొన్నిసార్లు మిడిలార్డర్‌లో కూడా ఆడాడు. ఈ సమయంలో అద్భుతంగా రాణించాడు. మిడిలార్డర్‌లో అతని సగటు 100పైగా ఉందట. ఓవరాల్‌గా చూసుకున్నా లిస్ట్-ఎ క్రికెట్‌లో అతని యావరేజ్ 54పైగానే ఉంది. అలాంటి ఆటగాడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి అతన్నే మిడిలార్డర్‌లో ఆడించాలని చెప్తున్నారు. దేశవాళీ రికార్డులు పరిశీలిస్తే సుదీర్ఘ ఫార్మాట్‌లో సూర్య అంతగొప్ప ఆటగాడు కాదని తెలిసిపోతుందని అంటున్నారు. సూర్య సగటు కేవలం 34 మాత్రమే అన్న సంగతి మర్చిపోకూడదని చెప్తున్నారు. మరి టీం మేనేజ్‌మెంట్ ఎవరిని ఆడిస్తుందో చూడాలి.

Story first published: Wednesday, February 8, 2023, 15:36 [IST]
Other articles published on Feb 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+