వన్డేల్లో మరో మైలురాయిని అధిగమించిన శ్రేయస్ అయ్యర్..

వెస్టిండీస్ సిరీస్ లో భారత బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగలు సాధించిన రెండో భారత ఆటగాడిగా శ్రేయస్ నిలిచాడు. అతని కంటే ముందు శిఖర్ ధావన్ , విరాట్ కోహ్లీ అత్యంత వేగంగా పరుగులు సాధించిన జాబితాలో ఉన్నారు. తొలి వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన శ్రేయస్ హాఫ్ సెంచరీతో(54) ఆకట్టుకున్నాడు.
ఇక అయ్యర్ 2017 లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరగ్రేటం చేశాడు. గాయం కారణంగా 2019 వరల్డ్ కప్ లో చోటు కోల్పోయిన.. అతను తిరిగి ఫామ్ అందిపుచ్చుకుని దూకుడు మీదున్నాడు.కోహ్లీ, ధావన్ ఇద్దరూ వెయ్యి పరుగుల మార్క్ ను 24 ఇన్నింగ్స్ లో సాధించగా.. శ్రేయస్ మాత్రం 25 వ ఇన్నింగ్స్ లో సాధించాడు. దీంతో రికార్డు సమం చేసే అవకాశాన్ని ఒక ఇన్నింగ్స్ తేడాతో కోల్పోయాడు. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 27 ఇన్నింగ్స్ లో ఈమార్క్ ని సాధించి 3 వ స్థానంలో నిలవడం గమన్హారం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications